National

Nandan Nilekani: పేపర్ లీకేజీలకు చెక్.. రంగంలోకి నందన్ నీలేకని.. ప్రధాని మోదీ కీలక నిర్ణయం

రచన: NK5 నిమిషాల పఠనం

పేపర్ లీకేజీలకు అడ్డుకట్ట వేసే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా సజావుగా నిర్వహించేలా పరీక్షల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఏ పరీక్షా సంస్కరణల కోసం ఇన్ఫోసిస్ కో ఫౌండర్, టెక్నాలజీ ఎక్స్ పర్ట్ నందన్ నీలేకని నేతృత్వంలో హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది.

Nandan Nilekani: పేపర్ లీకేజీలకు అడ్డుకట్ట వేసే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. భవిష్యత్తులో జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా సజావుగా, పారదర్శకంగా నిర్వహించేలా పరీక్షల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ఎన్టీఏ పరీక్షా విధానంలో సంస్కరణలపై సిఫార్సుల కోసం ఇన్ఫోసిస్ కో ఫౌండర్, టెక్నాలజీ ఎక్స్ పర్ట్ నందన్ నీలేకని నేతృత్వంలో హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఎగ్జామినేషన్ రిఫార్మ్స్ పై (పరీక్షల సంస్కరణల) ఈ హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ పని చేస్తుందని తెలిపింది.

నందన్‌ నీలేకనితో పాటు వేర్వేరు రంగాలకు చెందిన మరో ఐదుగురు నిపుణులను ఈ టాస్క్‌ ఫోర్స్ లో సభ్యులుగా చేర్చింది కేంద్రం. ఇస్రో మాజీ ఛైర్మన్ సోమనాథ్, ఐబీ మాజీ డైరెక్టర్ తపన్ దేకా, ఐఐటీ చెన్నై డైరెక్టర్ కామకోటి, మాజీ విద్యాశాఖ కార్యదర్శి అనితా కర్వాల్, లాజిస్టిక్స్ ఎక్స్ పర్ట్ అమృత్ లాల్ మీనా సభ్యులుగా ఉన్నారు.

హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు విషయాన్ని తెలుపుతూ ప్రధాని మోదీ సోషల్ మీడియాలో మరో వీడియో విడుదల చేశారు. పరీక్షా విధానం విశ్వసనీయంగా, పారదర్శకంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. టాస్క్ ఫోర్స్ నివేదిక ఆధారంగా రాబోయే పరీక్షలు నిర్వహిస్తామని ప్రధాని మోదీ చెప్పారు.

''మనం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలి. విశ్వసనీయమైన, పారదర్శకమైన, టెక్నాలజీని గరిష్టంగా వినియోగించుకునేలా పరీక్షా విధానం ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, ప్రపంచ ప్రఖ్యాత సాంకేతిక నిపుణుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాము.

ఈ టాస్క్ ఫోర్స్ పరీక్షల్లో సంస్కరణలపై దృష్టి సారిస్తుంది. వారి నివేదిక ఆధారంగా, విశ్వసనీయత దెబ్బతినకుండా భవిష్యత్తులో పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది" అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

NEET పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో యువత (Gen Z) తో మమేకమయ్యేందుకు ప్రధాని మోదీ కొన్ని రోజుల్లో విడుదల చేసిన మూడవ వీడియో ఇది. జూలై 23న విడుదల చేసిన తన మొదటి వీడియోలో, పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలను తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు. సోమవారం పార్లమెంటులో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు.

పరీక్షల నిర్వహణలో అత్యున్నత టెక్నాలజీని వినియోగించి.. విశ్వసనీయమైన, పారదర్శకమైన పరీక్ష విధానం అమలు చేస్తామని యువతకు భరోసాను ఇచ్చారు ప్రధాని మోదీ. NEET పరీక్షలో జరిగిన అక్రమాలపై తీసుకున్న చర్యలను వివరిస్తూనే, పేపర్ లీక్ ఘటనలు లక్షలాది మంది విద్యార్థులకు ఎంతటి తీవ్ర వేదనను కలిగిస్తాయో తనకు తెలుసన్నారు.

మరుసటి రోజు అర్ధరాత్రి మరో వీడియోను పంచుకున్నారు. అంతకుముందు వచ్చిన స్పందనలు, సానుకూల సూచనలకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. "మీ ప్రేమ ఇలాగే కొనసాగుతుంది. మన అనుబంధం మరింత బలపడుతుంది. ధన్యవాదాలు మిత్రులారా" అని మోదీ వీడియో రిలీజ్ చేశారు.

#Nandan Nilekani#High Powered Task Force#Exam Reforms#PM Modi#NEET Paper Leak
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి