సినిమా

Manoj Bajpayee: ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమాలో బాలీవుడ్ నటుడు కన్‌ఫర్మ్?

రచన: Anshu4 నిమిషాల పఠనం

Manoj Bajpayee: గత కొంతకాలంగా హిందీలో ఫేడవుట్ అయిన సీనియర్ యాక్టర్స్ కి సౌత్ లో మంచి అవకాశాలిచ్చి మన దర్శకులు కొత్త లైఫ్ ఇస్తున్నారు. కేజీఎఫ్ 2 తో రవీనా టాండన్, అనిమల్ సినిమాతో బాబీ డియోల్ లాంటి వారు ఇలా మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు బాగా బిజీ అయ్యారు. ఓజీ సినిమాతో ఇమ్రాన్ హహ్మీకి మంచి క్రేజ్ వచ్చింది. ఇలా, ఇప్పుడు బాలీవుడ్ నటులను మన వాళ్ళు ఎంచుకోవడం సర్వాత్రా అసక్తి నెలకొంది.

ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమాలో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కత్రీనా కైఫ్ ని ఓ కీలక పాత్ర కోసం ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో, ఆమె పోలీస్ ఆఫీసర్ పాత్రలో మంచి రోల్ తో అలరిస్తుందని అంటున్నారు. అలాగే, ఫౌజీ సినిమాలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి కీలక పాత్రల్లో సందడి చేయబోతున్నారు. భగవంత్ కేసరి సినిమాలోనూ అర్జున్ రాంపాల్ వినల్‌గా అద్భుతమైన పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.

ఇదే క్రమంలో, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా డ్రాగన్ మూవీలో మరో బాలీవుడ్ నటుడు ఎంపికైనట్టుగా తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ సినిమాగా డ్రాగన్ తెరకెక్కుతోంది. ఇప్పటికే, చాలా వరకూ షూటింగ్ పూర్తైంది. ఇందులో, తారక్ క్యారెక్టర్ హై ఓల్టేజ్ తో ఉంటుందని లుక్ చూస్తేనే అర్థమవుతోంది. హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ నటిస్తున్న సంగతి తెలీందే.

ఇప్పుడు, బాలీవుడ్ టాలెంటెడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. ప్రస్తుతం, ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేదం సినిమాలో మనోజ్ బాజ్‌పాయ్ కీలక పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. అలాగే, ది ఫ్యామిలీ మేన్ సిరీస్‌తోనూ బాగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇలాంటి, సమయంలో మనోజ్ బాజ్‌పాయ్ కి ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ లో ఛాన్స్ అంటే గొప్ప అవకాశం అనుకోవాలి. చూడాలి, మరి మేకర్స్ అఫీషియల్‌గా ఎప్పుడు కన్‌ఫర్మ్ చేస్తారో.

#ManojBajpayee#ntr#prashanthneel#dragon#rukminivasanth
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి