వైరల్ న్యూస్

Youth Power: ఇది కొత్తరకం పిడికిలి, ఇదొక మేలురకం యుద్ధం.. ఇన్‌స్టాలో వైరల్‌గా మారిన కవిత

రచన: NK5 నిమిషాల పఠనం

నీట్ పేపర్ లీక్ అంశంలో యువత చేసిన ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. యువత చేసిన శాంతియుత పోరాటంతో తల వంచక తప్పలేదు. చివరికి కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేశారు. నీట్ పేపర్ లీక్ కు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన పదవికి రాజీనామా సమర్పించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో యువత సక్సెస్ అయ్యారు. Gen-Z తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించారు. యువత పవర్ ఏంటో మరోసారి చాటి చెప్పారు. ఇదీ సార్ స్టూడెంట్స్ పవర్ అనేలా చేశారు మన విద్యార్థులు.

Youth Power: నీట్ పేపర్ లీక్ అంశంలో యువత చేసిన ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. యువత చేసిన శాంతియుత పోరాటంతో తల వంచక తప్పలేదు. చివరికి కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేశారు. నీట్ పేపర్ లీక్ కు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన పదవికి రాజీనామా సమర్పించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో యువత సక్సెస్ అయ్యారు. Gen-Z తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించారు. యువత పవర్ ఏంటో మరోసారి చాటి చెప్పారు. ఇదీ సార్ స్టూడెంట్స్ పవర్ అనేలా చేశారు మన విద్యార్థులు.

విద్యార్థులు సాధించిన అద్భుత విజయంపై సీనియర్ జర్నలిస్ట్ శివ ప్రసాద్ ఒక కవిత రాశారు. దీనికి తులసి చందు వాయిస్ ఇచ్చారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియలో వైరల్ గా మారింది. ఇన్ స్టా గ్రామ్ లో హోరెత్తిస్తోంది. ఆ కవిత రాజకీయ పార్టీలకు మేలుకొలుపులా ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. యువత శక్తి గురించి చాలా అద్భుతంగా చెప్పారన్న ప్రశంసలు వస్తున్నాయి. విద్యార్థులు తలుచుకుంటే ఏ ప్రభుత్వానికైనా ముచ్చెమటలు పట్టించగలరని నిరూపించారు. ఇన్ స్టా గ్రామ్ లో వైరల్ గా మారిన ఆ కవిత ఏంటో మీరూ ఓసారి చూసేయండి..

''మీరు పెంచిన సోషల్ మీడియాతోనే మీ పునాదులు పెకలించగలరు.

మీ వాట్సాప్ సిలబస్ చించేసి కొత్త చరిత్ర రాయగలరు.

మీ మొబైల్ ఫోన్లతోనే మీరు నేర్పించిన మీమ్స్ తోనే మీ కంట్లో పొడవగలరు.

వీళ్లు రాళ్లే విసరక్కర్లేదు. ఒక్క ప్లకార్డుతో మీ పరువంతా తీసేయగలరు.

వీళ్లు బూతులేమీ తిట్టక్కర్లేదు.

మీ బుర్ర తక్కువ ఉపన్యాసాలనే తిరిగి మీకు అప్పచెప్పేయగలరు.

వీళ్ల కోపంలో కవ్వింపు మీకు కత్తికంటే పదునుగా దిగుతుంది.

యువ గొంతుల్లోని వ్యంగం మిమ్మల్ని వెయ్యి శూలాలతో పొడుస్తుంది.

వీళ్లది కమ్యూనిస్టుల ఆవేశం కాదు.

ఇది జేఎన్‌యూ తరహా ఆగ్రహమూ కాదు.

బురఖాల బూచి చూపించి పాకిస్తాన్ పరదాల వెనుక మీరిక దాక్కోలేరు.

ఆజాదీ నినాదాలను వక్రీకరించి తుక్కు వాదనలు మీరిక చేయలేరు.

వీళ్ల చేతుల్లో జాతీయ జెండాలు ఉంటాయి.

మీరు కోరుకుంటే కాషాయ రెపరెపలు కూడా వీళ్ల చేతుల్లోకి వస్తాయి.

మీరు లాఠీలు ఎత్తితే వీళ్లు కన్నీళ్లతో నిలదీస్తారు.

మీరు దాడులు చేస్తే వీళ్లు దండం పెట్టి ఎదురు నిలుస్తారు.

ఇంతకు పదింతలు మీరు హింసించినా ఇన్ స్టా రీల్లై మీకు సమాధానం చెప్పారు.

ఇది కొత్త రకం పిడికిలి, ఇదొక మేలురకం యుద్ధం.

#NEET Paper Leak#Cockroach Janata Party#CJP#Thulasi Chandu#Youth Power#Gen Z#Dharmendra Pradhan#Swechaa News#Social Media#Instagram
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి
YouTubeలో చూడండి ↗

తర్వాత చదవండి