National

ViraL : ఎమర్జెన్సీ వార్డులోకి దూసుకొచ్చిన బైక్‌.. చితకబాది!(వీడియో)

రచన: Kumar3 నిమిషాల పఠనం

మద్యం మత్తులో కొందరు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఇటువంటి కల్చర్ క్రమేణా పెరుగుతున్నది. ఫూటుగా మద్యం సేవించి ఇతరులతో వాగ్వాదానికి దిగడం, వారిని అడ్డుకునే వారిపై దాడులు చేయడం,

మద్యం మత్తులో కొందరు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఇటువంటి కల్చర్ క్రమేణా పెరుగుతున్నది. ఫూటుగా మద్యం సేవించి ఇతరులతో వాగ్వాదానికి దిగడం, వారిని అడ్డుకునే వారిపై దాడులు చేయడం, పోలీసులతోనూ దురుసుగా ప్రవర్తించడం.. మహిళలు, అమ్మాయిలను వేధించడం వంటి ఘటనలు అనేకం వెలుగుచూస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇటువంటి ఘటనకు సంబంధించిన వీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. వీరిని చూసి మరికొందరు నేర్చుకునేలా రీల్స్ వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఇటువంటి ఘటనే ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. మద్యం మత్తులో ఇద్దరు యువకులు నేరుగా ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులోకి బైకుతో దూసుకొచ్చారు.ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ లో చోటుచేసుకుంది. BRIMS జిల్లా ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో ఇద్దరు మద్యం మత్తులో ఉన్న యువకులు బైక్‌తోనే లోపలికి వెళ్లారు. దీంతో అక్కడి రోగులు, వైద్య సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురిచేశారు.

https://x.com/muchatlu_/status/2081098604434047271?s=20

తీవ్ర తలనొప్పి ఉందంటూ ఆస్పత్రికి వచ్చిన ఇద్దరు, సాధారణంగా చికిత్స తీసుకోకుండా నేరుగా బైక్‌ను ఎమర్జెన్సీ వార్డులోకి నడిపించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారిని సిబ్బంది ఆపుతున్నా పట్టించుకోకుండా బైకును ఆస్పత్రిలో వేగంగా నడిపినట్టు సిబ్బంది చెబుతున్నారు. దీంతో అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారు ప్రతిఘటించడంతో స్వల్ప బలప్రయోగం చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

#ICU#bike came#drunkers#karnataka#arrested
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి