తెలంగాణ

Parliament : పేపర్ లీకేజీలకు చెక్..సవరణ బిల్లు రెడీ చేసిన కేంద్రం

రచన: Kumar3 నిమిషాల పఠనం

పార్లమెంట్ సమావేశాలు ఇకపై ఊపందుకోనున్నాయి. కాక్రోచ్ పార్టీ సారథ్యంలో విద్యార్థులు చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది.నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కేంద్రమంత్రి ధర్మేంద్ ప్రదాన్ రాజీనామా చేయాలని,

పార్లమెంట్ సమావేశాలు ఇకపై ఊపందుకోనున్నాయి. కాక్రోచ్ పార్టీ సారథ్యంలో విద్యార్థులు చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది.నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కేంద్రమంత్రి ధర్మేంద్ ప్రదాన్ రాజీనామా చేయాలని, విద్యారంగంలో సంస్కరణలు చేపట్టాలని దేశంలోని యువత కేంద్రాన్ని డిమాండ్ చేయగా.. మోడీ సర్కార్ అందుకు అంగీకరించింది. నిన్నకేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. విద్యార్థులపై పెట్టిన కేసుల ఉపసంహరణ, నీట్ లీకేజీ వలన చనిపోయిన కుటుంబాలకు పరిహారంపై మరో సారి సీజేపీ ప్రతినిధులు కేంద్రమంత్రులతో భేటీకానున్నారు.

విద్యార్థులు ఆందోళనలు విరమించడంతో లోక్‌సభ,రాజ్యసభ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగనున్నాయి. ఆరు రోజులుగా నిలిచిన తమ కీలక శాసన ఎజెండాను వేగవంతం చేసేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది.దీనిలో భాగంగానే భవిష్యత్‌లో పోటీ పరీక్షల్లో పేపర్ లీకేజీలకు చెక్ పెట్టేందుకు ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు- 2026’ను కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ సభ ముందుకు తీసుకురానున్నట్టు తెలిసింది.

ఈ బిల్లులో మొత్తం ఏడు కీలక మార్పులను కేంద్రం ప్రతిపాదించింది. కేసుల విచారణకు ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు, ఛార్జి‌షీట్ దాఖలైన 3 నెలల్లోగా విచారణ పూర్తి, 2 నెలల్లోనే విచారణ ముగించాలనే రూల్స్ చేర్చారు. ముఖ్యంగా పేపర్ లీకేజీలకు పాల్పడే ముఠాలు, కోచింగ్ సెంటర్లు, సర్వీస్ ప్రొవైడర్లపై కఠిన జైలు శిక్షలతో పాటు భారీ స్థాయిలో ఆర్థిక జరిమానాలు విధించేలా నిబంధనలు మార్చారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లుతో పాటు ఆదాయ పన్ను సవరణ బిల్లు, ఎంఎస్ఎంఈ అభివృద్ధి సవరణ బిల్లు, జనన-మరణాల నమోదు సవరణ బిల్లు వంటి పలు ఇతర ముసాయిదాలను కూడా కేంద్రం ఈ సమావేశాల్లో ఆమోదింపజేయాలని చూస్తున్నట్టు తెలిసింది.

#paper leaks#Bill amendments#parliament#modi government#politics
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి