సినిమా

Mega Family: గబ్బర్ సింగ్ రమేష్ కుటుంబానికి మెగా అండ

రచన: Anshu4 నిమిషాల పఠనం

Mega Family: మెగా ఫ్యామిలీ గురించి, మెగాస్టార్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తోటి వారే కాదు, తన అభిమానులు కష్టాల్లో ఉంటే క్షణాలో తమ వంతు సహాయం అందిస్తారు. అందుకే, మెగా ఫ్యామిలీని మానవత్వానికి మరో పేరుగా ఇండస్ట్రీలో చెప్పుకుంటారు. ఇటీవల పవన్ కళ్యాణ్ తన అభిమాని ఇంటికి వెళ్ళి కాసేపు ముచ్చటించి కావాల్సిన సహాయాన్ని అందించాడు.

ఇప్పుడు, గబ్బర్ సింగ్ సినిమాలో నటించిన రమేష్ కుటుంబానికి మెగా ఫ్యామిలీ మొత్తం అండగా నిలిచింది. మొన్న నాగబాబు రమేష్ కి 2 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం చేశాడు. ఇప్పుడు మెగాస్టార్ 3 లక్షల రూపాయల ఆర్ధిక సహాయంతో పాటు ప్రభుత్వం నుంచి అందే ఆరోగ్య భీమాను చూస్తానని మాటిచ్చారు.

పవన్ కళ్యాణ్ కూడా రమేష్ కుటుంబానికి అండగా నిలుస్తానని మాటిచ్చాడు. గబ్బర్ సింగ్ బ్యాచ్ లో రమేష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో మంచి పాత్రలతో అలరించాడు. సడన్‌గా బ్రైన్ స్ట్రోక్ రావడంతో, హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు రమేష్. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ తో పాటు పలువురు రమేష్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు.

కాగా, చిరంజీవి కేవలం ఒక్క రమేష్ విషయంలోనే కాకుండా, ఇండస్ట్రీలో ఎవరు కష్టాల్లో ఉన్నా ఇలాగే స్పందిస్తుంటారు. కరోనా సమయంలో ఎన్ని వందల కుటుంబాలను ఆదుకున్నాడో లెక్కే లేదు. నిత్యావరస వస్తువులతో పాటు కొంత ఆర్ధిక సహాయం కూడా చేశాడు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎంతోమందికి రక్తదానం, నేత్రదానం చేసి కొత్త జీవితాన్ని ప్రసాదించారు చిరంజీవి. మొత్తానికి, సినీ కార్మీకులకి..మెగా అభిమానులకు మెగా ఫ్యామిలీ ఎంతగా సహాయ సహకారాలు అందిస్తుందో అతికొద్దిమందికే తెలుసు.

#gabbarsinghramesh#megastar#nagababu#pawan kalyan
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి