తెలంగాణ

Peddi Health Update : ‘పెద్ది’ బతికేఉన్నారు.. వదంతులు వ్యాప్తి చేయొద్దు : వైద్యులు

రచన: Kumar3 నిమిషాల పఠనం

బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండె పోటుతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉందని ఆస్పత్రిలో చేరిన సమయంలో వైద్యులు తెలిపారు.

బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండె పోటుతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉందని ఆస్పత్రిలో చేరిన సమయంలో వైద్యులు తెలిపారు.ఈ క్రమంలోనే కొన్ని ప్రసార మాద్యమాలు ఆయన మరణించినట్టు కథనాలు రాశాయి. దీనిపై వరంగల్‌ రోహిణి ఆస్పత్రి వైద్యులు తాజాగా స్పందించారు.

పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్‌డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన చనిపోయారంటూ వస్తున్న అవాస్తవ ప్రచారాలు, వదంతులను నమ్మవద్దని స్పష్టంచేశారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన పెద్ది సుదర్శన్ రెడ్డికి వైద్యులు సీపీఆర్ సహా అత్యవసర చికిత్స అందించగా.. మళ్లీ హార్ట్ బీట్ పునరుద్ధరణ అయిందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టంచేశారు.

సుదర్శన్ రెడ్డి న్యూమోనియాతో బాధపడుతున్నారని, అది కాస్త తీవ్రంగా ఉందని అందుకే శరీరం కొంత సహకరించడం లేదని పేర్కొన్నారు. దానికి అవసరమైన చికిత్సను అందిస్తున్నామన్నారు. సుదర్శన్ రెడ్డికి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లుగా వైద్యులు తెలిపారు.కాగా, ఆయనకు గుండెపోటు వచ్చిన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు హుటాహుటిన హన్మకొండకు వెళ్లిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ నేతలు సైతం పెద్ది సుదర్శన్ ఆరోగ్య పరిస్థితిపై కొంత ఆందోళనగా ఉన్నట్టు సమాచారం.

#peddi sudarshanreddy#heartstroke#stable condition#warangal#BRS
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి