National

Maoists : మళ్లీ మావోయిస్టుల కలకలం.. పోస్టర్స్ విడుదల

రచన: Kumar3 నిమిషాల పఠనం

ఆపరేషన్ కగార్ ఈ ఏడాది ప్రారంభంలో పూర్తయిన విషయం తెలిసిందే. దాదాపు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు, కమాండర్లు లొంగిపోగా.. గణపతి మాత్రం ఎక్కడ ఉన్నాడో ఇంకా ఎవరికీ తెలియరాలేదు.

ఆపరేషన్ కగార్ ఈ ఏడాది ప్రారంభంలో పూర్తయిన విషయం తెలిసిందే. దాదాపు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు, కమాండర్లు లొంగిపోగా.. గణపతి మాత్రం ఎక్కడ ఉన్నాడో ఇంకా ఎవరికీ తెలియరాలేదు. బస్తర్, గడ్చిరోలి వంటి మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాలు ప్రస్తుతం నక్సల్స్ విముక్త ప్రాంతాలుగా మారాయి. ఈ మేరకు కేంద్రం ప్రకటన చేయడంతో పాటు బలగాలను వేరే చోటుకు తరలించాయి.ఇదిలాఉంటే గడ్చిరోలిలో తాజాగా మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయి. దీంతో స్థానికులు మరోసారి ఆందోళనకు గురవుతున్నారు.

కొంతకాలంగా ఏజెన్సీ ప్రాంతం ప్రశాంతంగా ఉన్నది. మరల మావోయిస్టుల కదలికలు మొదలవ్వడంతో మరోసారి టెన్షన్ వాతావరణ నెలకొంది. జిల్లాలోని భామ్రాగడ్ తాలూకా పరిధిలోని ప్రధాన రహదారులు, ప్రభుత్వ భవనాల వద్ద పోస్టర్లు కలకలం రేపాయి. స్థానిక ఆదివాసీల ‘జల్, జంగల్, జమీన్’ హక్కుల పరిరక్షణ, పలు స్థానిక సమస్యలపై నిరసనగా ఉత్తర గడ్చిరోలి డివిజన్ కమిటీ ఈ పోస్టర్లను విడుదల చేసింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల30 వరకు గడ్చిరోలి జిల్లా వ్యాప్తంగా బంద్ పాటించాలని ప్రజలకు, వ్యాపారులకు మావోయిస్టులు పిలుపునిచ్చారు. అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని రవాణా, వ్యాపార సముదాయాలు మూసివేయాలని ఆ పోస్టర్ల సారాంశం. పోస్టర్లు కనిపించడంపై గడ్చిరోలి పోలీసులు స్పందించారు. సీ-60 (C-60) కమాండో దళాలు వెంటనే రంగంలోకి దిగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, దాడులకు తావులేకుండా సరిహద్దు ప్రాంతాల్లో అదనపు భద్రతా బలగాలను మోహరించారు. భామ్రాగడ్, ఏటపల్లి, అహేరి అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా దళాలు కూంబింగ్ చర్యలు చేపట్టాయి.

#maoists#maharastra#gadchiroli#postars#national
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి