తెలంగాణ

Breaking : మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు..

రచన: Kumar3 నిమిషాల పఠనం

బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండె పోటు వచ్చింది. ఇవాళ ఉదయం ఉన్నట్టుండి ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హార్ట్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే హన్మకొండ హంటర్ రోడ్డులోని రోహిణి ఆస్పత్రికి తరలించారు.

బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండె పోటు వచ్చింది. ఇవాళ ఉదయం ఉన్నట్టుండి ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హార్ట్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే హన్మకొండ హంటర్ రోడ్డులోని రోహిణి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రస్తుతం ఐసీయూ (ICU)లో ఉంచి ఆయనకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు.

ముందుగా సీపీఆర్‌ చేసినట్టు సమాచారం. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే అస్వస్థతకు గురైన విషయం తెలిసి ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్టు సమాచారం. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు రోహిణి ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఆయన ఆరోగ్య పరిస్థితిపై తోటి నాయకులకు కాల్స్ చేసి ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. విషయం తెలియడంతో బీఆర్ఎస్ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హుటాహుటిన హనుమకొండకు బయలుదేరారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై అధికారిక హెల్త్ బులెటిన్ కోసం కుటుంబ సభ్యులు, అభిమానులు ఎదురుచూస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ సైతం సుదర్శన్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినట్టు తెలిసింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, వారి కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉండాలని ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది.

#narsampet former mla#peddi sudarshan reddy#heart stroke#warangal
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి