ఏపీ

AP : ఘరానా మోసం.. సైబర్ నేరగాళ్లకు చిక్కిన ఏపీ, తెలంగాణ యువత!

రచన: Kumar3 నిమిషాల పఠనం

ఏపీకి చెందిన కొందరు యువత సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నట్టు తెలిసింది. సోషల్ మీడియాలో ఉద్యోగాల ప్రకటన చూసి పలువురు వారిని సంప్రదించగా..ముఠా వ్యక్తులను వారిని దేశం దాటించి అక్కడ చిత్రహింసలు పెడుతున్నట్టు సమాచారం.

ఏపీకి చెందిన కొందరు యువత సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నట్టు తెలిసింది. సోషల్ మీడియాలో ఉద్యోగాల ప్రకటన చూసి పలువురు వారిని సంప్రదించగా..ముఠా వ్యక్తులను వారిని దేశం దాటించి అక్కడ చిత్రహింసలు పెడుతున్నట్టు సమాచారం. సింగపూర్‌లో ఐటీ ఉద్యోగాలు పెట్టిస్తామని, నెలకు రూ.1.25 లక్షల భారీ వేతనమంటూ యువతకు గాలెం వేసినట్టు తెలిసింది. వీరంతా జాబ్స్ కోసం వెళ్లడంతో అక్కడ బందీలుగా మారినట్టు సమాచారం. బాధితుల్లో గుంటూరు జిల్లా మంగళగిరి-తాడేపల్లి, కృష్ణా జిల్లా అవనిగడ్డ, శ్రీకాకుళం జిల్లా పలాసతో పాటు తెలంగాణ చెందిన పలువురు నిరుద్యోగులు ఉన్నట్టు సమాచారం

సింగపూర్ చేరుకున్న తెలుగు రాష్ట్రాల యువతను సైబర్ ముఠా సభ్యులు ముందుగా సంప్రదించారు. అనంతరం వారి నుంచి పాస్‌పోర్టులు, ఇతర కీలక ధృవీకరణ పత్రాలను బలవంతంగా లాక్కుని రహస్య ప్రాంతంలో నిర్బంధించినట్టు సమాచారం. తాము చెప్పినట్టు సైబర్ నేరాలకు పాల్పడాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్టు తెలిసింది. పారిపోవడానికి ప్రయత్నించిన వారికి కరెంట్ షాక్ ఇవ్వడం, చీకటి గదుల్లో బంధించి ఆహారం ఇవ్వకుండా బాధించడం, యువతులపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్టు తెలిసింది.

బాధితుల్లో కొందరు ముఠాకు తెలియకుండా ఫోన్ ద్వారా తమ వారికి కాల్స్ చేసి తమ దీనస్థితిని వివరించినట్టు సమాచారం. వారి ఫ్యామిలీ మెంబర్స్ వెంటనే కేంద్ర విదేశాంగ శాఖకు జులై 17న ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అనంతరం జులై 22న ఏపీ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) విభాగానికి కూడా ఫిర్యాదు చేయడంతో అధికారులు స్పందించారు.విదేశాల్లో చిక్కుకున్న తెలుగు యువకులను సురక్షితంగా ఇండియాకు రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఏపీఎన్‌ఆర్‌టీ ప్రతినిధులు బాధిత కుటుంబాలకు భరోసానిచ్చారు.

#Cyber criminals#jobs#cheating#AP and Telnagana Youth
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి