Malavika Mohanan: మహిళ దర్శకులపై రాజాసాబ్ హీరోయిన్ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ప్రస్తుతం ఇటు సోషల్ మీడియాలో అటు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చగా మారింది. ఇటు సౌత్ సినిమా ఇండస్ట్రీలైన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో గానీ, బాలీవుడ్ లో గానీ లేడీ డైరెక్టర్స్ చాలా తక్కువ అని చెప్పాలి.
ఇంకా, చెప్పాలంటే మన తెలుగు తో పాటు ఇతర భాషల్లో ఉన్న ఫీమేల్ డైరెక్టర్స్ ని వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. ప్రస్తుతం మనకి కనిపిస్తున్న ఫీమేల్ డైరెక్టర్స్ గీతూ మోహన్ దాస్, సుధ కొంగర, మానస శర్మ. ఇప్పటికే, సుధ కొంగర చేసిన సినిమాలతో టాప్ డైరెక్టర్‌గా బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో పాపులర్ అయింది.
ఇక, రాకాస సినిమాతో విఠలా చార్య పేరును గుర్తు చేసి డీసెంట్ ఫీమేల్ డైరెక్టర్‌గా పాపులర్ అయింది మానస శర్మ. గతంలో ఈమె బెంచ్ లైఫ్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ కి రచయితగా, కొన్ని ఎపిసోడ్స్ కి దరకురాలిగా వర్క్ చేసింది. రాకాస సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా చూస్తున్నంతసేపు అప్పట్లో వచ్చిన విఠలా చార్య సినిమాలే గుర్తొచ్చాయి.
ఇలాంటి, దర్శకుల సంఖ్య ఇంకా పెరగాలన్నారు హీరోయిన్ మాళవిక మోహనన్. ఫీమేల్ యాక్ట్రస్ కి ప్రాధాన్యం ఉన్న పాత్రలు దక్కాలంటే లేడీ డైరెక్టర్స్ పెరిగితేనే అది సాధ్యమన్నట్టుగా.. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాళవిక చేసిన ఈ కామెంట్స్ చాలామందిని ఆలోచింపజేసింది. చూడాలి, మాళవిక మాటలతో మన ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళా దర్శకుల సంఖ్య పెరుగుతుందేమో.












