సినిమా

Katrina Kaif: ప్రభాస్ 'స్పిరిట్' లో కత్రినా రోల్ లీక్!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Katrina Kaif: టాలీవుడ్ లో మల్లీశ్వరి గా అలరించిన కత్రినా కైఫ్..ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ సరసన కూడా అల్లరి పిడుగు సినిమాను చేసింది. వెంకటేష్ తో చేసిన మల్లీశ్వరి బ్లాక్ బస్టర్ కాగా, అల్లరి పిడుగు మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత కత్రీనా బాలీవుడ్ సినిమాలకే పరిమితమైంది.

Katrina Kaif: టాలీవుడ్ లో మల్లీశ్వరి గా అలరించిన కత్రినా కైఫ్..ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ సరసన కూడా అల్లరి పిడుగు సినిమాను చేసింది. వెంకటేష్ తో చేసిన మల్లీశ్వరి బ్లాక్ బస్టర్ కాగా, అల్లరి పిడుగు మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత కత్రీనా బాలీవుడ్ సినిమాలకే పరిమితమైంది. తెలుగులో అవకాశాలను ఎవరూ ఇవ్వలేదు. కెరీర్ ప్రారంభంలో హిందీ ఇండస్ట్రీ కూడా కత్రినాను కామెంట్స్ చేసింది.

అలాంటి, కత్రినాకే ఆ తర్వాత రోజుల్లో స్టార్ హీరోయిన్ కిరీటం తొడిగి జస్ట్ ఐటం సాంగ్స్ కే కోట్లు గుమ్మరించింది. ఒక దశలో హిందీ వాళ్ళు నిర్మించిన సినిమాలలో కత్రీనాకే ఫస్ట్ బెర్త్ కన్‌ఫమ్ చేశారు. అయితే, ఈ మధ్య ఈ పొడుగు కాళ్ళ సుందరికి అక్కడ కూడా అవకాశాలు తగ్గిపోయాయి. ఇలాంటి, సమయంలో మన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అవకాశం ఇచ్చాడంటే, గ్యారెంటీగా అది మంచి కంబ్యాక్ అవుతుందనడంలో సందేహం లేదు.

బాబి డియోల్ విషయంలో ఇదే జరిగింది. కొన్నేళ్ళపాటు బాబీ డియోల్ కి సినిమాలు లేక ఖాళీగా ఉన్నాడు. అలాంటి, సమయంలో అనిమల్ సినిమాలో ఛాన్స్ ఇచ్చిన సందీప్, కొత్త లైఫ్ ఇచ్చాడు. అనిమల్ హిట్ తర్వాత బాబీ డియోల్ ఇప్పుడు చాలా బిజీ యాక్టర్ అయ్యాడు. దీనికి, కారణం సందీప్ అని ఎమోషనల్ అయిన సందర్భం కూడా ఉంది. ఇక, ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ సినిమా కోసం కత్రీనా కైఫ్ ని సెలెక్ట్ చేశాడట.

ఇందులో, ఆమెది పోలీస్ ఆఫీసర్ రోల్ అని తెలుస్తోంది. కాప్ స్టోరీగా స్పిరిట్ రూపొందుతోంది. 40 శాతం చిత్రీకరణ పూర్తైంది. ప్రస్తుతం, ప్రభాస్‌తో ఓ లాంగ్ షెడ్యూల్ జరుగుతోందట. ఈ షెడ్యూల్ లో కత్రీనా కూడా జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి, సందీప్ రెడ్డి వంగా హిందీలో ఫేడవుట్ అయిన సీనియర్స్ కి కొత్త లైఫ్ ఇస్తూ హాట్ టాపిక్ అవుతున్నాడు. కాగా, స్పిరిట్ మూవీలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రీ నటిస్తోంది. ఇప్పటికే, ఈ సినిమా నుంచి వచ్చిన లుక్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

#prabhas#KatrinaKaif#spirit#andeepreddyvanga#TriptiDimri
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి