తెలంగాణ

Telangana: ఆహార-ఔషధ కల్తీపై ఉక్కుపాదం.. రంగంలోకి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌!..

రచన: Venu5 నిమిషాల పఠనం

ఆహార కల్తీ.. ఔషధ కల్తీ.. ఇవి కేవలం మోసాలు కాదు. ప్రజల ప్రాణాలతో ఆడే ప్రమాదకరమైన ఆట. ముఖ్యంగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులను దృష్టిలో ఉంచుకుని.. కల్తీని కట్టడి చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది.

మనిషి పుట్టినప్పటి నుంచి చివరి శ్వాస వరకు.. అతని జీవితం రెండు విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఆకలి తీర్చే ఆహారం.. అనారోగ్యాన్ని నయం చేసే ఔషధం. కానీ నేటి సమాజంలో ఈ రెండింటిలోనూ కల్తీ ప్రవేశించింది. ఇది కేవలం మోసం కాదు.. మనిషి జీవితంపైన జరిగే దాడి.. ఆహారంలో కల్తీ శరీరాన్ని నెమ్మదిగా క్షీణింపజేస్తుంది.. ఔషధంలో కల్తీ ప్రాణాన్నే తీస్తుంది. ప్రస్తుత సమాజంలో మనిషి ప్రాణం కంటే లాభం విలువైనదిగా మారిందా? అనే ప్రశ్నకు సమాధానం లేదు..

ఆహార కల్తీ.. ఔషధ కల్తీ.. ఇవి కేవలం మోసాలు కాదు. ప్రజల ప్రాణాలతో ఆడే ప్రమాదకరమైన ఆట. ముఖ్యంగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులను దృష్టిలో ఉంచుకుని.. కల్తీని కట్టడి చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది.

ఆహార, ఔషధ కల్తీ నియంత్రణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ విభాగం అందుబాటులోకి రాబోతోంది. ప్రస్తుతం వేర్వేరుగా పనిచేస్తున్న డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఫుడ్ సేఫ్టీ విభాగాలతోపాటు... క్షేత్రస్థాయిలో నేరుగా తనిఖీలు నిర్వహించే ప్రత్యేక బృందాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకురావాలన్నది ప్రభుత్వ ఆలోచన.

ఈ కొత్త విభాగం పర్యవేక్షణ బాధ్యతలను ఐపీఎస్ అధికారి అవినాశ్ మహంతికి అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వ ఆమోదానికి వెళ్లాయని సమాచారం. ఇందుకోసం దాదాపు 1,500 మంది సిబ్బంది అవసరమని ప్రతిపాదించారు. ఇందులో పోలీస్ శాఖ నుంచి సుమారు 150 మంది సిబ్బందిని కేటాయించే యోచన ఉన్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం ఔషధ కల్తీ నియంత్రణను నారాయణగూడలోని ఐపీఎం, ఆహార నమూనాల పరీక్షలను నాచారంలోని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ పర్యవేక్షిస్తున్నాయి. కానీ రెండు విభాగాల్లో కలిపి మంజూరైన పోస్టులు 300లోపే. వాటిలోనూ దాదాపు సగం ఖాళీగా ఉన్నాయి. దీంతో తనిఖీలు, నమూనాల పరీక్షలు, కేసుల దర్యాప్తులో జాప్యం జరుగుతోంది. ఇక కొత్త విభాగం ప్రధానంగా క్యూర్ ప్రాంతంపై దృష్టి పెట్టనుంది.

ఇక్కడ 1.25 లక్షల వరకు నమోదైన ఆహారశాలలు ఉన్నాయి. నమోదు కానివి దీనికి నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటాయని అంచనా. హెచ్-ఫాస్ట్ బృందాల తనిఖీల్లో తరచూ కల్తీ పదార్థాలు బయటపడుతున్నా.. నమూనాల పరీక్షల ఫలితాల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం నెలకు వెయ్యి నమూనాలు మాత్రమే పరీక్షించే సామర్థ్యాన్ని... నాలుగు వేలకు పెంచాలని ప్రతిపాదించారు.

అంతేకాదు.. కేసు నమోదు నుంచి దర్యాప్తు, ఛార్జ్‌షీట్, కోర్టు విచారణ, తీర్పు వరకు మొత్తం ప్రక్రియను ఈ ప్రత్యేక విభాగమే పర్యవేక్షించేలా ప్రణాళిక సిద్ధమవుతోంది. ఇందుకోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్‌తోపాటు ఆరుగురు ఏపీపీలను కూడా కేటాయించాలని ప్రతిపాదించారు. కల్తీకి చెక్ పెట్టేందుకు కేవలం తనిఖీలు మాత్రమే కాదు... కేసు నుంచి శిక్ష వరకు పూర్తి స్థాయి వ్యవస్థను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం సిద్దం అవుతున్నట్టు తెలుస్తుంది.

#Telangana#task force#food and drug#Adulteration#Prevention
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి