Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ ఇప్పుడు ఓ విభిన్నమైన సినిమాను చేస్తున్నాడు. అదే ఇరుముడి. క్లాస్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణతో మాస్ హీరో చేస్తున్న ఈ సినిమాపై ప్రారంభం నుంచే మంచి బజ్ క్రియేట్ అయింది. తండ్రీ కూతురు మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా ఇరుముడి సినిమా తెరకెక్కుతోంది. దాదాపు, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా చివరి దశకి చేరుకుంది.
ఆగస్టు 21వ తేదీన రిలీజ్ కి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు శివ నిర్వాణ ఇరుముడి సినిమా ప్రమోషన్స్ చాలా వినూత్నంగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రవితేజతో కొన్ని ప్రత్యేకమైన ఇంటర్వ్యూస్ అలాగే, పాప-రవితేజతో కలిపి కొన్ని, హీరోయిన్ ప్రియా భవానీ శంకర్-రవితేజ కాంబోలో కొన్ని ప్లాన్ చేస్తున్నాడట.
ఈ ఇంటర్వ్యూలలో శివ నిర్వాణ కూడా పాల్గొనబోతున్నాడు. అంతేకాదు, అయ్యప్ప స్వామీ ఆలయ ప్రాంగణంలో కూడా ఇంటర్వ్యూలను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కథా నేపథ్యం ఇదే కాబట్టి, శివ నిర్వాణ ఇలా కొత్త తరహాలో ప్రమోషన్స్ ప్లాన్ చేశాడట. గత కొంతకాలంగా మన మాస్ రాజాకి హిట్ దక్కలేదు. శివ నిర్వాణకి నిన్ను కోరు, మజిలీ చిత్రాల తర్వాత సక్సెస్ పడలేదు.
కాబట్టి, వీరిద్దరూ హిట్ కోసం ఎంతో కసితో ఇరుముడి సినిమాను చేశారు. చూడాలి మరి ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ ని అందుకుంటారో. కాగా, ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీత దర్శకుడు. ఇరుముడి చిత్రంలో బేబీ నకాస్త్ర.. రవితేజ కూతురుగా నటిస్తోంది. ఇక, ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను భాగానే పెంచేశాయి.












