సినిమా

Gopichand Malineni: బాలయ్య కోసం దర్శకుడు ప్రత్యేజ పూజా, హోమం

రచన: Anshu3 నిమిషాల పఠనం

Gopichand Malineni: మన సీనియర్ స్టార్ హీరోలకి ప్రేక్షకుల్లో మాత్రమే అభిమానులు ఉన్నారనుకుంటే పొరపాటే. ఇప్పుడున్న జనరేషన్ హీరోలు, దర్శకులు, ఇతర టెక్నీషియన్స్ కూడా మన మెగాస్టార్, బాలయ్య లాంటి వారికి పెద్ద అభిమానులే. ఆ అభిమానంతోనే సినిమాకి వర్క్ చేసేటప్పుడు ప్రాణం పెట్టేస్తున్నారు. దర్శకులైతే, తమ అభిమాన హీరోలకి భారీ హిట్ ఇవ్వాలని ఎంతో కసితో పనిచేస్తున్నారు.

పూరి జగన్నాధ్, వివి వినాయక్, గోపీచంద్ మలినేని, బాబీ, రాజమౌళి..ఇలా చెప్పుకుంటూపోతే అభిమాన దర్శకుల లిస్ట్ చాలా పెద్దదే తేలుతుంది. పూరి జగన్నాధ్ కి మెగాస్టార్ అన్నా, బాలయ్య అన్నా ఎనలేని ప్రేమ. చిరుతో సినిమా డైరెక్ట్ చేయకపోయినా, ఆయనతో కలిసి స్క్రీన్ మాత్రం షేర్ చేసుకున్నాడు. ఆటోజానీ సినిమా పలు కారణాల వల్ల ఆగిపోయింది.

బాలయ్యతో మాత్రం పూరి జగన్నాధ్ పైసా వసూల్ తీసిన సంగతి తెలిసిందే. అలాగే, గోపీచంద్ మలినేని కి బాలయ్య అంటే ఎనలేని అభిమానం. వీరి కాంబినేషన్‌లో వచ్చిన వీర సింహారెడ్డి మంచి కమర్షియల్ సక్సెస్‌ను సాధించింది. ఇప్పుడు, వీరిద్దరూ కలిసి మరో సినిమాను చేస్తున్నారు. ప్రస్తుతం, ఈ సినిమా షూటింగ్ కాకినాడ పోర్ట్ లో జరుగుతుండగా, బాలయ్యకి గాయం అయింది.

హైదరాబాద్ లో సర్జరీ జరిగింది. ప్రస్తుతం బాలయ్య ఆరోగ్యం బాగానే ఉంది. ఇప్పటికే, నందమూరి అభిమానులు బాలయ్య త్వరగా కోలుకోవాలని పూజలు చేశారు. ఈ క్రమంలోనే చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా, బాలయ్య త్వరగా కోలుకొని సెట్స్‌తో అడుగుపెట్టాలని, ఫుల్ ఎనర్జీతో సెట్స్‌లోకి రావాలని బెంగుళూరులోని ప్రముఖ దేవాలయంలో హోమం, ప్రత్యేకించి పూజలు జరిపించాడట. ఇప్పుడు, ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

#balakrishna#gopichandmalineni#nbk111#purijagannadh
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి