Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి 2028 వరకూ కొత్త సినిమా వచ్చే అవకాశాలు లేవా? ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది ఇదే మాట. ఇటీవలే, చరణ్ నుంచి వచ్చిన పెద్ది చిత్రం అటు ప్రేక్షకులను, ఇటు మెగా అభిమానులను బాగా డిసప్పాయింట్ చేసింది. ఆశించిన రేంజ్ లో సినిమా లేకపోవడంతో నిర్మాతలకి నష్టాలే అన్న మాట వినిపించింది.
గత చిత్రాలు చూసుకుంటే గేమ్ ఛేంజర్, పెద్ది భారీ హిట్ సాధిస్తాయనుకున్న వారికి బిగ్ షాకినిచ్చాయి. అయితే, అలాంటి షాక్ మరోటి తగలబోతుందని తెలుస్తోంది. పెద్ది ఎటూ నిరాశపరిచింది కాబట్టి, వీలైనంత త్వరగా సుకుమార్ దర్శకత్వంలో సినిమాను పట్టాలెక్కిస్తాడని అందరూ భావించారు. కానీ, ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు ఇంకా ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ ఓ కొలిక్కి రాలేదట.
ఇందుకోసం సుకుమార్ అండ్ టీమ్ చాలానే శ్రమిస్తోందని, ఎక్కువ సమయమే తీసుకోనున్నారని టాక్ వినిపిస్తోంది. చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ తర్వాత ఆశించిన సక్సెస్ దక్కకపోవడంతో సుకుమార్ ని స్క్రిప్ట్ విషయంలో అస్సలు తొందరపెట్టకూడదని డిసైడయ్యాడట. ఇది, మంచిదే గానీ..మరీ ఏడాది వరకూ కొత్త సినిమా సెట్స్ పైకి రాకపోవడమే అభిమానులకు మింగుడు పడటం లేదు.
ఏదేమైనా, ఈ ఏడాది చివరిలో అయినా షూటింగ్ మొదలవుతుందనుకుంటే, ఆ విషయంలో క్లారిటీ గానీ, కన్‌ఫర్మేషన్ గానీ రావడం లేదు. 2027 లో సెట్స్ పైకి వచ్చే సుకుమార్-చరణ్ ల సినిమా 2028 లో రిలీజ్ అయ్యే అవకాశాలున్నట్టుగా కనిపిస్తోంది. ఇదే, నిజమైతే మెగా ఫ్యామిలీ హీరోలలో గ్లోబల్ రేంజ్ పాపులారిటీ ఉన్న చరణ్ ఫ్యాన్స్ కి పెద్ద షాకింగ్ న్యూసే అవుతుంది.












