నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత నెల రోజులుగా శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా యువత సేజేపీ పార్టీకి మద్దతు ప్రకటించారు. సామాజిక మాధ్యమాల ద్వారా యవత వారికి కనెక్ట్ అయ్యారు. మొన్న సేజేపీ ఇచ్చిన దేశవ్యాప్త నిరసనల కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది.పలు రాజకీయ పార్టీలు సైతం విద్యార్థుల సమస్యలను పరిష్కారించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వారికి అండగా నిలిచారు.
ఈ క్రమంలోనే చర్చలకు రావాలిన కేంద్రం సేజేపీకి ఆహ్వానం పంపగా .. కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంద్రసింగ్.. సేజేపీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా విద్యారంగంలో సంస్కరణలు, కేంద్రమంత్రి ధర్మంద్ర ప్రదాన్ రాజీనామా, విద్యార్థులపై పెట్టిన కేసులు ఉపసంహించుకోవాలని సీజేపీ ప్రతినిధులు కేంద్రమంత్రులను డిమాండ్ చేశారు.
రెండు సార్లు భేటీ అనంతరం కాక్రోచ్ ప్రతినిధులు పెట్టిన మూడు డిమాండ్లకు కేంద్రం అంగీకరించింది. కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ సైతం నిన్న రాజీనామా చేశారు. అయితే, ఈ విషయాన్ని చర్చలకు వెళ్లిన కాక్రోచ్ ప్రతినిధులు .. సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కేకు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో ఆయన ఒక్కసారిగా మోకాళ్ల మీద కుర్చుని ఎమోషనల్ అయ్యారు. కేంద్రమంత్రి రాజీనామా చేశారని ప్రకటించడంతో జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.అయితే,అభిజిత్ ఎమోషనల్ అయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది..
https://x.com/Cockroachisback/status/2080944180994678919?s=20
దానికి ఇన్ స్టాగ్రామ్‌లో కేవలం 10 గంటల్లో 12 కోట్ల వ్యూస్ (120మిలియన్) వచ్చాయి. సేజేపీకి ఇన్ స్టాలో 2.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఉద్యమంలో జెన్ జీ అంతా సోషల్ మీడియా.. ఇన్ స్టా, ఫేస్ బుక్ ద్వారానే తమ నిరసనలను దేశవ్యాప్తంగా వైరల్ అయ్యేలా చేశారు. దెబ్బకు కేంద్రం దిగిరావడంతో పాటు నేటి యువత ఇన్ స్టాలోనే ఎక్కువగా ఉంటుందని, వారికి దగ్గర అయ్యేందుకు కేంద్రమంత్రులు సైతం ఇన్ స్టా వాడాలని, రీల్స్ చేయాలని, వారితో ముచ్చటించాలని ఏకంగా ప్రధాని మోడీ కేబినెట్ మంత్రులను ఆదేశించడం చూస్తుంటే భవిష్యత్ లో మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే ఇన్ స్టా వంటి సోషల్ ఫ్లాట్ ఫామ్స్ కే ఆదరణ ఉందని అర్థంఅవుతోంది.












