సినిమా

Rakul Preet Singh: అది కొనుక్కోవచ్చుననే సినిమాల్లోకి వచ్చా!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Rakul Preet Singh: సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా హీరోయిన్స్ చాలామంది అనుకోకుండా ఈ రంగంలోకి అడుగుపెడతారు. ఏదో ఈవెంట్ లో చూసిన దర్శకుడో, నిర్మాతో ఛాన్స్ ఇస్తే స్టార్స్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక, కొంతమంది మోడలింగ్ రంగంలో ఉండగా వచ్చిన అవకాశాలతో హీరోయిన్‌గా పాపులర్ అవుతారు. ఇంకొందరు ఏదో సరదా ఉండి..ఫస్ట్ మూవీలో ఛాన్స్ వస్తే, ఆ సరదా తీర్చుకోవాలనే ఆశతో ఇండస్ట్రీకి వస్తారు.

ఇలా వచ్చిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అవును, తాజాగా ఆమె చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యం కలగకమానదు. రకుల్ నటించిన మొదటి సినిమా గిల్లి. ఇది కన్నడ చిత్రం. అప్పట్లో తనకి కారు కొనుక్కోవాలనే ఆశ ఉండేదట. ఆ సమయంలో గిల్లి సినిమా కోసం 5 లక్షలు ఆఫర్ చేస్తే, వెంటనే ఆ సినిమాను ఒప్పుకుందని, తన కెరీర్ ప్రారంభం రోజుల గురించి చెప్పుకొచ్చింది.

అలా, మొదటి సంపాదనతో కారు కొనుక్కోవాలనుకున్న రకుల్..ఆ తర్వాత పెద్ద దర్శకులతో, పెద్ద నిర్మాణ సంస్థలలో, పెద్ద హీరోల సరసన నటించి వందల కోట్లు సంపాదించింది. అంతేకాదు, కొన్నిటికి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరించి భారీగా సంపాదించింది. ఫిట్‌నెస్ లో రకుల్ ని చాలామంది హీరోయిన్స్ ఇన్స్పిరేషన్‌గా తీసుకున్నారు.

ఇక, గిల్లి సినిమాలో రకుల్ ని చూసిన మేర్లపాక గాంధీ, సందీప్ కిషన్ హీరోగా రూపొందించిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాలో హీరోయిన్‌గా ఎంచుకున్నాడు. ఈ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బక్క పలచని బ్యూటీ, నాగ చైతన్య, జూనియర్ ఎన్‌టిర్, మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి టాలీవుడ్ టాప్ స్టార్స్ తో రొమాన్స్ చేసింది. తమిళ, హిందీ భాషలలో కూడా ఒకప్పుడు రకుల్ మంచి క్రేజీ హీరోయిన్. గత కొంతకాలంగా అమ్మడికి తెలుగులో అవకాశాలు లేకుండా పోయాయి.

#rakulpreethsingh#gilli#venkatadriexpress#ntr#maheshbabu#ramcharan
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి