Janhvi Kapoor: జాన్వీ కపూర్...బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. బ్లాక్ బస్టర్ మరాఠా మూవీ సైరత్ కి హిందీ రీమేక్ గా ధడక్ మూవీ వచ్చింది. ఈ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి పాపులర్ అయింది. ఆ తర్వాత, చాలా సినిమాలు చేసింది. మధ్యలో, ఐటం సాంగ్స్ చేసింది. కానీ, శ్రీదేవికి వచ్చిన క్రేజ్ లో పదిశాతం రాలేదు. శ్రీదేవికి తన కూతుర్లను స్టార్స్ గా చూడాలని కోరిక బలంగా ఉండేది.
కానీ, ఆమె కోరిక హీరోయిన్ గా నెరవేరినప్పటికీ, స్టార్స్ గా మాత్రం ఎదగలేకపోయారు. జాన్వీ కపూర్ టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. బోనీ కపూర్ కి బాలీవుడ్ కంటే సౌత్ లో స్టార్స్ గా చూడాలని ఆశ ఉంది. కానీ, ఇక్కడ జాన్వీ హీరోయిన్‌గా సక్సెస్ కాలేదు. ఇంతవరకూ ఖుషి కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వలేదు.
తమిళంలో బోనీ కపూర్ నిర్మాతగా అజిత్ కుమార్ తో వరుసగా హిట్స్ తీశాడు. తెలుగులో, దిల్ రాజుతో కలిసి పవన్ కళ్యాణ్ హీరోగా వకీల్ సాబ్ సినిమాను తీసి హిట్ అందుకున్నాడు. కానీ, జాన్వీ కోసం మాత్రం ఇక్కడ నేరుగా సినిమా చేయలేదు. జాన్వీ తెలుగులో జూనియర్ ఎన్‌టిర్ సరసన దేవర సినిమా చేసింది. ఈ సినిమాలో తన అందాల ఆరబోతకి బాగానే పేరొచ్చింది గానీ, సినిమా మాత్రం డిసప్పాయింట్ చేసింది. అలాగే, పెద్ది సినిమా కూడా నిరాశపరిచింది.
దాంతో, ఇప్పుడు తన డెబ్యూ డైరెక్టర్‌తో మళ్ళీ సినిమా చేసేందుకు జాన్వీ కపూర్ సన్నాహాలు చేస్తోందట. నాగరాజ్ మంజులే అద్భుతమైన కథను జాన్వీకి చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే, ఆ కథలో జాన్వీ కపూర్ నటిస్తుందా లేక తన చెల్లి ఖుషి కపూర్ కోసం చర్చలు జరుపుతుందా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై, మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. కాగా, ప్రస్తుతం జాన్వీ కొత్త సినిమాల కోసం ఎదురు చూస్తోంది.












