Spirituality

Spiritual: మనిషి జీవితంలో ఆధ్యాత్మికత ఎందుకు ముఖ్యం?

రచన: Venu4 నిమిషాల పఠనం

ఆధ్యాత్మికత అంటే.. కేవలం గుడికి వెళ్లడమో, పూజలు చేయడమో కాదు! మనలోని అహంకారాన్ని తగ్గించుకోవడం.. కోపాన్ని జయించడం.. భక్తి మన సమస్యలను వెంటనే తొలగించకపోవచ్చు.. కానీ సమస్యలను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. పరిస్థితులను మార్చకపోవచ్చు.. కానీ పరిస్థితులను చూసే మన దృష్టిని మార్చుతుంది.

డబ్బు సంపాదిస్తే సౌకర్యాలు వస్తాయి.. పేరు సంపాదిస్తే గుర్తింపు వస్తుంది.. కానీ మనసుకు ప్రశాంతత మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా.. తనలోని ఖాళీని నింపుకోలేకపోతే.. ఆ జీవితం అసంపూర్ణంగానే మిగిలిపోతుంది. ఆ ఖాళీని నింపేది ఆధ్యాత్మికత.

ఇక ఆధ్యాత్మికత అంటే.. కేవలం గుడికి వెళ్లడమో, పూజలు చేయడమో కాదు! మనలోని అహంకారాన్ని తగ్గించుకోవడం.. కోపాన్ని జయించడం.. ఇతరుల బాధను అర్థం చేసుకుంటూ, మనసును పవిత్రంగా ఉంచుకోవడం!.. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు.. మన చుట్టూ ఉన్నవారంతా దూరమై మనం ఒంటరిగా మిగిలినప్పుడు.. మనకు అండగా నిలిచే 'అంతరంగ విశ్వాసమే'... నిజమైన దైవం!

భక్తి మన సమస్యలను వెంటనే తొలగించకపోవచ్చు.. కానీ సమస్యలను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. పరిస్థితులను మార్చకపోవచ్చు.. కానీ పరిస్థితులను చూసే మన దృష్టిని మార్చుతుంది. ఎందుకంటే.. మనిషి తన కర్మను అనుభవిస్తాడు.. కానీ భగవంతుడిపై విశ్వాసం ఉన్నవాడు ఆ కర్మను ధైర్యంగా ఎదుర్కొంటాడు.

మధ్వ మార్గంలో ఆధ్యాత్మికత మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది.. ఈ ప్రపంచంలో మనం ఏదీ శాశ్వతంగా తీసుకెళ్లలేం. సంపద, అధికారం, అందం, పేరు.. ఇవన్నీ కాలంతో పాటు మారిపోతాయి. కానీ మనం చేసిన మంచి.. మనం పంచిన ప్రేమ.. మనం చూపిన దయ.. మన జీవితం పై చెరగని ముద్రను వేస్తాయి. అందుకే ఆధ్యాత్మికత అంటే ప్రపంచాన్ని వదిలి అడవులకు వెళ్లడం కాదు.. ఈ ప్రపంచంలో ఉంటూ.. మనసును దైవంతో అనుసంధానం చేయడం అని వేదోత్తములు చెబుతారు.

ప్రతి ఉదయం భగవంతుడిని స్మరించడం.. ప్రతి కష్టంలో విశ్వాసాన్ని కోల్పోకపోవడం.. ప్రతి విజయాన్ని అహంకారంగా కాకుండా దైవ కృపగా భావించడం..ఇదే నిజమైన ఆధ్యాత్మికత. ఎందుకంటే మనిషి జీవితంలో అన్నీ ఉన్నా.. మనశ్శాంతి లేకపోతే ఏదీ లేనట్టే. కానీ భగవంతుడిపై నమ్మకం ఉంటే.. ఏమీ లేని సమయంలో కూడా మనిషి లోపల ఒక అద్భుతమైన శక్తి ఉంటుందని చెబుతారు.

ప్రస్తుతం సమాజంలో నిజమైన ఆథ్యాత్మిక లోపించడం వల్ల తన పై తాను నియంత్రణ కోల్పోయి.. ఈ భూమి మీద తాము ఒక అరుదైన ప్రాణిమనే విషయాన్ని మనుషులు మరచిపోతున్నారు. ఫలితంగా సమాజం అల్లకల్లోలంగా మారుతుందని.. ఎప్పుడైతే మనిషి మనసు దైవత్వంతో నిండిపోయి ఉంటుందో అప్పుడు మాత్రమే మానవ జీవితం కర్మకు అతీతంగా ముందుకు సాగుతుందని పండితులు వివరిస్తున్నారు..

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంకేతిక సమాచారం. సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలని మనవి..

#Spiritual#Indian#spirituality important#human life#temple
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి