Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ కోసం ఎంతగా శ్రమించాడో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత సినిమా పెద్ది. ఇందులో, రెండు విభిన్నమైన పాత్రల్లో నటించాడు. అయితే, ఓ పాత్ర కోసం మణికట్టు కూడా దెబ్బతిన్నది. అలాగే, చేతికి కట్టు కట్టుకొని సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు.
అయితే, డాక్టర్లు..చరణ్ మణికట్టుకి చిన్నపాటి సర్జరీ అవసరమని సూచించారట. దీంతో, చరణ్ సతీ సమేతంగా కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు, చరణ్ వెంట మెగాస్టార్ చిరంజీవి, సురేఖ కూడా వెళ్ళారు. ఈరోజే చరణ్ కి సర్జరీ చేయనున్నారట.
మన హీరోలు, సినిమా కోసం వందల కోట్లలో రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారనే చెప్పుకుంటారు గానీ, ఆ సినిమా కోసం వారు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా స్టంట్స్ చేస్తారని మాత్రం చెప్పుకోరు. డాన్సులు చేసినా, ఫైట్స్ చేసినా..ఒళ్ళు హూనం చేసుకునేది తమ అభిమానులను అలరించడానికే.
ఈ మధ్య పవన్ కళ్యాణ్ భుజానికి సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. అలాగే, బాలయ్య కూడా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ కాకినాడ పోర్ట్ లో జరుగుతున్న సమయంలో గాయం అయింది. దీంతో, బాలయ్యకి కూడా సర్జరీ చేయాల్సి వచ్చింది. ఇలా, మన హీరోలందరూ ఏదో ఒక సినిమా షూటింగ్ లో గాయాలపాలవడం, సర్జరీ వరకూ వెళ్ళడం కాస్త బాధపడాల్సిన విషయం.
దీన్ని కూడా కొందరు యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తుంటారు. ఏదేమైనా, మన హీరోలు ప్రేక్షకుల కోసం, అభిమానుల కోసం ఇలా గాయాలవడం చూస్తుంటే ఇలాంటి రిస్క్, అవసరమా అనిపిస్తుంది. ఇక, చరణ్ కి ఈరోజు సర్జరీ అయ్యాక ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోమని డాక్టర్స్ సూచిస్తారో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాగా, సుకుమార్ దర్శకత్వంలో చరణ్ నెక్స్ట్ సినిమాను చేయనున్నాడు.












