జూన్ రెండో వారం నుంచి కురవాల్సిన వర్షాలు జులై చివరివారంలో కురుస్తున్నాయి.రాష్ట్రంలో ఎల్ నినో ఎఫెక్ట్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. వర్షాలు లేక అన్నదాతలు అల్లాడుతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.సాగు నీరులేక ఇబ్బంది పడిన రైతులకు నైరుతి రుతుపవనాల్లో కదలిక శుభవార్త చెప్పినట్టు అయ్యింది.దీంతో వ్యవసాయ పనుల్లో జోష్ పెంచారు.
నైరుతి రుతుపవనాలు యాక్టివ్ అవ్వడంతో ఉత్తర తెలంగాణ జిల్లాలు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి,కరీంనగర్.. తూర్పు జిల్లాలైన భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ నివేదిక వెల్లడించింది. నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, సిద్దిపేట, జనగామ, హన్మకొండ, వరంగల్, నారాయణపేట జిల్లాలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, మిగతా చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది.
గడిచిన 24 గంటల్లో ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్లానింగ్ సొసైటీ వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో అత్యధికంగా 77.8 మి.మీ వర్షపాతం నమోదు కాగా, సంగారెడ్డిలో 71.8 మి.మీ నమోదైంది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో 70.8 మి.మీ, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్‌లో 61 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక హైదరాబాద్‌లో రాత్రంతా తేలికపాటి వర్షం పడింది.












