సినిమా

Rashmika Mandanna: నేను నాలా ఉన్నాను కాబట్టే ఈ సక్సెస్!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Rashmika Mandanna: నేను నాలా ఉన్నాను కాబట్టే ఈ సక్సెస్ వచ్చింది అంటోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఛలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ కన్నడ భామ..మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను, మేకర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. కెరీర్ ప్రారంభంలో ఒకటి రెండు ఫ్లాపులొచ్చినా కూడా భయపడలేదు. ఛలో, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో మంచి క్రేజీ హీరోయిన్‌గా మారింది.

పుష్ప ఫ్రాంఛైజీస్‌తో పాన్ ఇండియా క్రేజ్..

ఇక, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించిన పుష్ప ఫ్రాంఛైజీస్‌తో గ్లోబల్ వైడ్‌గా రష్మిక పాపులారిటీని సంపాదించుకుంది. దాంతో, బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఈ నేషనల్ క్రష్ కి వరుసగా ఆఫర్స్ వచ్చి పడ్డాయి. ఏ హీరోయిన్‌కైనా అవకాశాలు రావడం ఒకెత్తైతే, అవి విజయాలు సాధించడం మరొక ఎత్తు. రష్మికకి అదే కలిసి వచ్చింది. ఆమె నటించిన సినిమాలు దాదాపు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలుగా నిలిచాయి.

హిందీలో, నటించిన అనిమల్ ఎలాంటి క్రేజ్ ని తెచ్చిపెట్టిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన ఛావా కూడా బ్లాక్ బస్టర్. సల్మాన్ తో నటించిన సికందర్ నిరాశపరిచినా, ఆ ప్రభావం రష్మికపై పడలేదు. ది గర్ల్ ఫ్రెండ్, సీతారామం లాంటి సినిమాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. మైసా లాంటి ఛాలెంజింగ్ రోల్స్ కూడా రష్మికను అగ్ర స్థానంలో నిలబెట్టాయి. దీనంతటికి కారణం తాను తీసుకున్న సొంత నిర్ణయాలే అంటోంది.

భర్త విజయ్ దేవరకొండ సరసన రణబాలి..

ఎవరి మెప్పుకోసమో కాకుండా.. నేను నాలాగే ఆలోచించాను..నాలాగే ఉన్నాను. నా అంతరాత్మ చెప్పిందే చేశాను. మీరు కూడా మీలాగే ఉండండి చాలు..సక్సెస్ అవుతారు అని తెలిపింది. ప్రస్తుతం, రష్మిక అన్న మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా, ఈ నేషనల్ క్రష్..తన భర్త విజయ్ దేవరకొండ సరసన రణబాలి సినిమాను చేస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

#RashmikaMandanna#Vijaydevarakonda#Pushpa#Animal#Ranabaali
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి