తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా పసిడి ధరలు నిరంతరం పెరుగుతూ రాగా, తాజాగా సోమవారం ఉదయం 6గంటలకు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఆతర్వాత 10గంటల తర్వాత కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే మళ్లీ పెరిగింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు రూ.930 మేర పుంజుకుని రూ. 1,45,860 స్థాయికి చేరింది. దీనితో పాటు, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములపై రూ.850 ఎగబాకి ప్రస్తుతం రూ.1,33,700 వద్ద విక్రయించబడుతోంది.
మరోవైపు, పసిడి ధరలు పెరిగినప్పటికీ, వెండి ధరల్లో మాత్రం పెద్దగా మార్పు కనిపించలేదు. ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,40,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని విభిన్న నగరాలు, ప్రాంతాలను బట్టి ఈ రేట్లలో స్వల్పంగా వ్యత్యాసాలు ఉండే అవకాశం ఉందని వర్తకులు వెల్లడించారు. అంతేకాకుండా, ఇక్కడ పేర్కొన్న మార్కెట్ ధరలకు అదనంగా 3 శాతం జీఎస్టీ (GST) వర్తిస్తుందని కొనుగోలుదారులు గమనించాలి.
ఇదిలా ఉండగా సోమవారం ఉదయం 6 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల పుచ్ఛ బంగారం ధర 10గ్రాములకు రూ.1,44,920 వద్ద ట్రేడ్ అయింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,32,840గా నమోదు కాగా, 18 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.1,08,690 వద్ద కొనసాగింది. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే 24 క్యారెట్ల బంగారానికి రూ.930, 22క్యారెట్ల బంగారానికి రూ.850 పెరగడం గమనార్హం.
మరోవైపు చెన్నై, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో పసిడి ధరలు మన ప్రాంతంతో పోలిస్తే కొద్దిగా ఎక్కువగా నమోదయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా రోజులో ఈ ధరలలో హెచ్చుతగ్గులు జరిగే అవకాశం ఉన్నందున, కొనుగోలుదారులు షాపింగ్‌కు వెళ్లే ముందు స్థానిక వర్తకులను సంప్రదించి తాజా రేట్లను సరిచూసుకోవడం శ్రేయస్కరం.












