సినిమా

Aadarsha Kutumbam Glimpse: వెంకీ కి సరిగ్గా సరిపోయే కథ..మరో హిట్ పక్కా..

రచన: Anshu3 నిమిషాల పఠనం

Aadarsha Kutumbam Glimpse: వెంకటేష్ అంటే కంప్లీట్ ఫ్యామిలీ హీరో. కెరీర్ ప్రారంభం నుంచి ఈ హీరో మీద పడిన ఇమేజ్ అలాంటిది. అందుకే, ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలనే ఎక్కువగా చేస్తూ వస్తున్నాడు. శత్రువు, ధర్మ చక్రం, గణేష్ లాంటి యాక్షన్ సినిమాలు చేసినా కూడా వాటిలో ఫ్యామిలీ ఎమోషన్సే ఎక్కువగా ఉన్నాయి. మన టాలీవుడ్ లో మెగాస్టార్ అయినా, బాలకృష్ణ అయినా మాస్ హీరోలు అని అంటారు.

కానీ, వెంకటేష్ కి మాత్రం ఆ ఇమేజ్ అంతగా రాలేదు. నువ్వు నాకు నచ్చావ్, పవిత్ర బంధం, పెళ్ళి చేసుకుందాం, రాజా, కలిసుందాం రా, ప్రేమించుకుందాం రా..ఇలాంటి సినిమాలన్నీ కుటుంబ కథా చిత్రాలుగానే వచ్చి భారీ విజయాలను అందుకున్నాయి. ఇక, ఇటీవల వెంకీ నుంచి వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలలో ఫన్ ఏ రేంజ్‌లో ఉందో అందరికీ తెలిసిందే.

అలాంటి, మరో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనరే ఆదర్శకుటుంబం. వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ఇది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఇందులో వెంకటేష్ ఇద్దరు పిల్లలకి తండ్రిగా నటించాడు. తాజాగా, వెంకీ పోషిస్తున్న పాత్ర చిట్టిబాబు రోల్ ని పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

ఈ గ్లింప్స్ చూస్తే ఇది కంప్లీట్ వన్ మ్యాన్ షోగా ఉండబోతుందని క్లారిటీ వచ్చేసింది. ఇటీవల కాలంలో ఇలాంటి ఫ్యామిలీ చిత్రాలను ప్రేక్షకులు చూసింది లేదు. ఇక, నారా రోహిత్ ఈ సినిమాలో చేసిన స్పెషల్ కామియో రోల్‌ హైలెట్ గా నిలవబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ని ఈ అక్టోబర్ 2, 2026న థియేటర్లలో భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.

#AadarshaKutumbam#AadarshaKutumbamGlimpse#Venkatesh#Trivikram#SrinidhiSetty
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి
YouTubeలో చూడండి ↗

తర్వాత చదవండి