Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా రాకా. దీపికా పడుకోణె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ దాదాపు 700 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
అయితే, ఈ సినిమా కథ ఎలా ఉంటుందో అని అందరూ అనుకుంటున్నారు. రాకా నుంచి ఇంతకముందు వచ్చిన అల్లు అర్జున్ లుక్ చూసి పాజిటివ్ కామెంట్స్ కంటే నెగిటివ్ కామెంట్సే ఎక్కువగా ఉన్నాయి. కొందరేమో శంకర్ సినిమాలలోని లుక్ మాదిరిగా ఉందని ట్రోల్ చేస్తే, ఇంకొందరేమో 1980లలో వచ్చిన ఒనిడా టీవీ యాడ్ మాదిరిగా ఉందని కామెంట్స్ చేశారు. ఏదేమైనా, రాకా సినిమాపై అంచనాలు మాత్రం పీక్స్‌లో ఉన్నాయి.
ఇక, ఇదొక మాఫియా బ్యాక్‌డ్రాప్ లో జరిగే కథ అని కోలీవుడ్ మీడియాలో న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. ఫారిన్ టెక్నీషియన్స్ రాకా కోసం వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు దర్శకుడు అట్లీ. అంతేకాదు, సెట్స్ కూడా భారీగా నిర్మిస్తున్నారు. కేవలం సెట్స్ కోసమే వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. అయితే, తాజా సమాచారం మేరకు ఇప్పుడు ఓ భారీ సెట్ నిర్మించారట. దీనికి, భారీగా ఖర్చు చేశారట.
ఈ సెట్ లో అల్లు అర్జున్ ఇంట్రో సీన్స్ చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. సినిమాకి ఇదొక హైలెట్ సీక్వెన్స్ అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. పుష్ప ఫ్రాంఛైజీస్ తో అల్లు అర్జున్ మార్కెట్ ఇంటర్నేషనల్ లెవల్‌కి వెళ్ళింది. వేల కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు, రాకా సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ హాలీవుడ్ అంచులు తాకుతుందని చెప్తున్నారు. చూడాలి, మరి ఈ సినిమాతో అల్లు అర్జున్ ఎలాంటి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో.












