Varanasi: దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి భారీ సెట్స్ వెయ్యాలంటే అది హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలోనే ప్లాన్ చేసుకుంటారు. బాహుబలి సినిమా రెండు భాగాలు కూడా మెజారిటీ షూటింగ్ ఇక్కడే జరిగింది. భారీ పోరాటఘట్టాలు, కీలకమైన సన్నివేశాలు ఫిల్మ్ సిటీలో చిత్రీకరించాడు. మాహిష్మతి సామ్రాజ్యం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు.
అదొక ఊహాజనితమైన సామ్రాజ్యం. ఆ సెట్ కోసం కోట్లు వెచ్చించి షూటింగ్ జరిపారు. ఆర్ఆర్ఆర్ కోసం కూడా రాజమౌళి ఇలాంటి భారీ సెట్స్ ని నిర్మించి సినిమాను తెరకెక్కించాడు. ఇప్పుడు, కూడా ఇతర దేశాలలో షూటింగ్ జరిపినప్పటికీ, హైదరాబాద్ లో అల్యూమియం ఫ్యాక్టరీ, రామోజీ ఫిల్మ్ సిటీలలో భారీ సెట్స్ వేసి చిత్రీకరణ జరిపారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న వారణాసి సినిమా కోసం కూడా ఇలాగే, అత్యంత భారీ సెట్స్ ని వేశారు. ప్రస్తుతం..ఇక్కడే అఘోర సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నారు. వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ భారీ సీక్వెన్స్ లో పాల్గొంటున్నారు. వారణాసి సినిమాలోని ముఖ్యమైన ఐమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఇదివరకే పూర్తి కాగా, ఇంకా 80 రోజుల షూటింగ్‌ను కంప్లీట్ చేయాల్సి ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ వరకూ, పూర్తి చేయాలని జక్కన్న బృందం టార్గెట్ పెట్టుకుంది.
ఇక, ఈ సినిమాలో మహేష్ బాబు.. రుద్ర, శ్రీరాముడు పాత్రల్లో కనిపించనున్నాడు. మందాకిని పాత్రలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఇప్పటికే, వీరి లుక్స్ సినిమాలో మెయిన్ హైలెట్‌గా ఉంటాయని జక్కన్న శాంపిల్‌గా చూపించాడు. విలక్షణ నటుడు పృథ్విరాజ్ సుకుమార్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఎంఎం కీరవాణి సంగీతం..దర్శకరచయిత దేవా కట్ట డైలాగ్స్ అందిస్తున్నాడు. 20 భాషలలో 120 దేశాలలో వారణాసి రిలీజ్ కాబోతోంది.












