Health

Health: ఈ సమస్యలున్నవారు బొప్పాయి అస్సలు తినకూడదని తెలుసా..?

రచన: Venu4 నిమిషాల పఠనం

బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండు. జీర్ణక్రియను మెరుగుపరచడం నుంచి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉంటుంది. అయితే అందరికీ బొప్పాయి ఒకేలా ఉపయోగపడదు.

బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండు. జీర్ణక్రియను మెరుగుపరచడం నుంచి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉంటుంది. అయితే అందరికీ బొప్పాయి ఒకేలా ఉపయోగపడదు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పచ్చి లేదా సగం పండిన బొప్పాయిని తినకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే లాటెక్స్, పపైన్ అనే పదార్థాలు గర్భాశయ సంకోచాలకు కారణమై, గర్భస్రావం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే లాటెక్స్ అలర్జీ ఉన్నవారిలో బొప్పాయి అలర్జీని కలిగించే ప్రమాదం ఉంటుంది.

రక్తం పలుచబరిచే మందులు తీసుకునే వారు కూడా బొప్పాయిని అధికంగా తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఎందుకంటే ఇది రక్తస్రావం మరింత అయ్యేలా దోహదపడుతుందట. అంతేకాదు, జీర్ణాశయ సమస్యలు లేదా తరచూ విరేచనాలతో బాధపడేవారు బొప్పాయిని పరిమితంగా తీసుకోవడం మంచిదని లేకుంటే ఇందులో ఉన్న ఫైబర్ కొందరిలో సమస్యలను మరింత పెంచవచ్చని చెబుతున్నారు.

అలాగే మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నవారు కూడా బొప్పాయి విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇందులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. అయితే, విటమిన్-సి అతిగా శరీరంలోకి చేరితే అది 'ఆక్సలేట్' గా మారి, కిడ్నీలో రాళ్లు ఉన్నవారి సమస్యను మరింత ఎక్కువ చేస్తుందట..

ఇక డయాబెటిస్ ఉన్నవారికి బొప్పాయి మంచిదే అయినప్పటికీ, 'హైపోగ్లైసీమియా సమస్య ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది షుగర్ లెవెల్స్‌ను మరింత తగ్గించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

అయితే ఆరోగ్యవంతులైన వారికి బొప్పాయి ఒక అద్భుతమైన పండు. ఇందులో విటమిన్ A, విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి శరీరానికి శక్తిని అందిస్తాయి. కాబట్టి బొప్పాయి తినే ముందు మీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, అవసరమైతే వైద్యుల సలహాతో తీసుకోవడం ఉత్తమం అని చెబుతున్నారు..

ముఖ్య గమనిక: సాంకేతిక సమాచారం ఆధారంగా ఈ విషయాలు తెలియజేయడం జరిగింది. ఏదైనా డైట్ ఫాలో అయ్యే ముందు నెఫ్రాలజిస్ట్ లేదా రీనల్ డయాటీషియన్‌ను సంప్రదించడం తప్పనిసరి.. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అని గుర్తించ గలరు!..

#Health#Papaya#Anticoagulants#Kidney Stones#Health Tips
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి