Health

Health: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవలసిన బెస్ట్ ఫుడ్ ఇదే!..

రచన: Venu5 నిమిషాల పఠనం

మన శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలను, టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో మూత్రపిండాలు అంటే కిడ్నీలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. అయితే, కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. అలాగే కిడ్నీ సమస్యలతో బాధపడేవారు సైతం తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు..

మానవ శరీరంలో మూత్రపిండాల పాత్ర చాలా కీలకం అనే విషయం తెలిసిందే.. అందుకే వీటి పట్ల శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.. ఇందుకోసం మంచి ఫుడ్ తీసుకోవాలంటున్నారు. ముఖ్యంగా ఈ ఫుడ్ కిడ్నీలకు మంచిదని చెబుతున్నారు.. అవి ఏంటో తెలుసుకొందాం..

మన శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలను, టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో మూత్రపిండాలు అంటే కిడ్నీలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. అయితే, కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. అలాగే కిడ్నీ సమస్యలతో బాధపడేవారు సైతం తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు..

మొదటిది.. కాలీఫ్లవర్. కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైన సూపర్ ఫుడ్. ఎందుకంటే ఇందులో సోడియం, పొటాషియం, ఫాస్పరస్ వంటి మూలకాలు చాలా తక్కువగా ఉంటాయి. కిడ్నీ రోగులకు ఈ మూడు తక్కువగా ఉండటం ఎంతో అవసరం. పైగా ఇందులో ఉండే విటమిన్ సి, ఫోలేట్, ఫైబర్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

రెండవది.. రెడ్ క్యాప్సికమ్. సాధారణంగా కిడ్నీ వ్యాధి ఉన్నవారికి పొటాషియం తక్కువగా ఉండే ఆహారాలు కావాలి. రెడ్ క్యాప్సికమ్‌లో పొటాషియం చాలా తక్కువగా ఉండటమే కాకుండా.. విటమిన్ సి, ఎ, విటమిన్ బి6 మరియు ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కిడ్నీల పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

మూడవది.. పొట్లకాయ. ఇందులో దాదాపు 96 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి, మూత్రవిసర్జన సాఫీగా సాగడానికి దోహదపడుతుంది. అయితే, కిడ్నీ వ్యాధి ముదిరిన వారు నీటి శాతాన్ని నియంత్రించుకోవాలి కాబట్టి, వారు వైద్యుల సలహా మేరకే దీనిని తీసుకోవాలి.

ఇక బెండకాయ, ఆకుకూరల విషయానికి వస్తే ఒక ముఖ్యమైన హెచ్చరిక గుర్తుంచుకోవాలి. బెండకాయలో అలాగే కేల్ వంటి ఆకుకూరల్లో పొటాషియం, ఆక్సలేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నవారికి ఇవి మంచివే అయినప్పటికీ.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు లేదా డయాలసిస్ పేషెంట్లు వీటిని ఎక్కువగా తీసుకుంటే సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. వీటితో పాటు రోజువారీ డైట్‌లో ఆపిల్స్, ముల్లంగి వంటి పొటాషియం తక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను చేర్చుకోవడం కిడ్నీలకు ఎంతో రక్షణ ఇస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు..

ముఖ్య గమనిక: కిడ్నీ వ్యాధి ఉన్న వారు పాటించవలసిన జాగ్రత్తలను డాక్టర్లు నిర్ణయిస్తారు. కాబట్టి ఏదైనా డైట్ ఫాలో అయ్యే ముందు నెఫ్రాలజిస్ట్ లేదా రీనల్ డయాటీషియన్‌ను సంప్రదించడం తప్పనిసరి.. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అని గుర్తించగలరు!..

#Health#Dietitian#Kidney Specialist#best food#healthy kidneys
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి