Vaishnavi Das: ఈ మధ్య కాలంలో యువతకు సోషల్ మీడియా పిచ్చి పట్టింది. అందరూ సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారు. ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ అంటూ వాటి వెనుక పడుతున్నారు. నీళ్లు, తిండి లేకున్నా ఉండగలుగుతున్నారేమో కానీ, సోషల్ మీడియా లేకుండా ఒక్క క్షణం కూడా లేని వాళ్లు ఎందరో. రీల్స్ చూస్తూ రోజంతా కాలక్షేపం చేసే వారు చాలా మందే ఉన్నారు. నేటి యువత మీద సోషల్ మీడియా దుష్ప్రభావం భారీగానే ఉంది. సరిగ్గా చదువుకోవడం కూడా లేదు. సోషల్ మీడియా మోజులో పడి చేతులారా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అయితే, ఇందుకు భిన్నంగా ఓ అమ్మాయి చేసిన పని ఇప్పుడు యువతను ఆలోచింపజేస్తోంది. ఓ అమ్మాయి తన ఇన్ స్ట్రాగ్రామ్ అకౌంట్ ను డిలీట్ చేసింది. ఇప్పుడు ఏకంగా నీట్ లో జాతీయ స్థాయిలో 20వ ర్యాంక్ సాధించింది.
ఇటీవల నీట్ రీటెస్ట్ 2026 ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో వైష్ణవి దాస్ ఆల్ ఇండియా 20వ ర్యాంక్ సాధించింది. కాగా, తాను ఈ ర్యాంక్ సాధించడానికి గల కారణాలను వైష్ణవి వివరించింది. 11వ తరగతిలో ఉండగానే తాను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను డీయాక్టివేట్ చేసినట్లు వైష్ణవి తెలిపింది. ఇన్ స్టాగ్రామ్ తో టైమ్ వేస్ట్ తప్ప ఎలాంటి లాభం లేదని చెప్పింది. ఇక, తాను రోజుకు ఇన్ని గంటలే చదవాలని ప్లాన్ చేసుకోలేదంది. వారం పాటు ప్లాన్ చేసుకునే దాన్ని అని చెప్పింది. మాక్ టెస్టులు, ఎన్ సీఈఆర్ టీ రివిజన్ తో పాటు పాజిటివ్ మైండ్ సెట్ ఎంతో ముఖ్యం అని స్పష్టం చేసింది వైష్ణవి.
NEET UG 2026లో AIR 20 (అఖిల భారత ర్యాంకు 20) సాధించిన వైష్ణవి దాస్.. వైద్య ప్రవేశ పరీక్షలో 720కి 700 మార్కులు సాధించడానికి తనకు సహాయపడిన తన సన్నద్ధత విధానాలను వెల్లడించింది. NEET సన్నద్ధత సమయంలో ఇన్‌స్టాగ్రామ్ ఒక ఆటంకంగా భావించి, తాను 11వ తరగతిలో అడుగుపెట్టినప్పుడే దానిని నిలిపివేసినట్లు (డీయాక్టివేట్) వైష్ణవి తెలిపింది. నా ఏకాగ్రతను దెబ్బతీస్తుండటంతో 11వ తరగతిలోనే ఇన్‌స్టాగ్రామ్‌ను డీయాక్టివేట్ చేశానని పేర్కొంది.
నిలకడ, క్రమం తప్పని మాక్ టెస్టులు, NCERT పునశ్చరణ (రివిజన్), సానుకూల దృక్పథం వంటివి తన ప్రతిభకు కీలక కారణాలని చెప్పింది. విద్యార్థులు కేవలం తాము చదివే గంటలను లెక్కించుకోకుండా, తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని భవిష్యత్ నీట్ అభ్యర్థులకు సలహా ఇచ్చింది వైష్ణవి.
ప్రిపరేషన్ సమయంలో పరధ్యానాలను నివారించడం గురించి మాట్లాడిన వైష్ణవి.. తాను 11వ తరగతిలోకి ప్రవేశించిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ను డీయాక్టివేట్ చేశానని చెప్పింది. "అది కేవలం ఒక పరధ్యానం మాత్రమే, అంతకు మించి ఏమీ కాదు". మన ఏకాగ్రతను ప్రభావితం చేసే కార్యకలాపాలను గుర్తించి, వాటిని సమర్థవంతంగా నిర్వహించుకోవాలి'' అని నీట్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సలహా ఇచ్చింది వైష్ణవి.
ఈ లింక్ ఓపెన్ చేసి వీడియో చూడొచ్చు..












