తెలంగాణ

నోటిఫికేషన్లు లేవు.. అన్నీ లూటిఫికేషన్లే.. తెలంగాణలో కాంగ్రెస్‌కి ఇక డెత్ డిక్లరేషనే- కేటీఆర్

రచన: NK4 నిమిషాల పఠనం

60 ఏళ్లు తెలంగాణ నెత్తురు రుచి మరిగిన కాంగ్రెస్.. కొత్త డూప్లికేట్ రూపాల్లో వచ్చి నకిలీ ప్రేమను కురిపించి యువతను బలిపీఠం ఎక్కించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన యూత్ డిక్లరేషన్ పెద్ద మోసం

* తెలంగాణ యువతకు రాహుల్ వెన్నుపోటు

* నోటిఫికేషన్లు లేవు.. అన్నీ లూటిఫికేషన్లే

* రాష్ట్రంలో "స్కాం" క్యాలెండర్ నడుస్తోంది

* కొలువుల జాతర చేస్తామని కుంభకోణాల కుంభమేళా సాగిస్తున్నారు

* రేవంత్ జాబులు కాదు రాహుల్ జేబులు నింపుతున్నాడు

* అధైర్య పడొద్దు.. తెలంగాణ నిరుద్యోగులకు అన్నగా తోడుంటా

* ఇప్పటిదాకా ఒక లెక్క... ఇకపై ఇంకో లెక్క

* కాంగ్రెస్ ‘యూత్ డిక్లరేషన్’ ఒక దగా

* సరూర్ నగర్ ‘యువ సంగ్రామ సదస్సు’లో కేటీఆర్ గర్జన

తెలంగాణ యువతను యూత్ డిక్లరేషన్ పేరుతో దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఇక డెత్ డిక్లరేషనే మిగిలిందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. యూత్ డిక్లరేషన్ ఇచ్చిన వేదికపైనే.. తెలంగాణ యువత కాంగ్రెస్ కు ‘డెత్ డిక్లరేషన్ రాస్తుందన్నారు. సరిగ్గా మూడేళ్ల క్రితం ఏ సరూర్ నగర్ స్టేడియం వేదికగా కాంగ్రెస్ పార్టీ ‘యూత్ డిక్లరేషన్’ బురిడీ పత్రాన్ని ఆవిష్కరించిందో, అదే వేదికపై ఇవాళ తెలంగాణ నిరుద్యోగ యువత కాంగ్రెస్ మోసాలను గ్రహించిందని కేటీఆర్ స్పష్టం చేశారు. మాట తప్పి, నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అదే గడ్డపై నుంచి యువత ‘డెత్ డిక్లరేషన్’ (రాజకీయ మరణ శాసనం) రాయడానికి సిద్ధంగా ఉందని కేటీఆర్ హెచ్చరించారు.

మాయమాటలతో యువతను మోసం చేస్తామంటే కుదరదని.. నిరుద్యోగుల ఉడుకు నెత్తురు, ఉరకలెత్తే ఆశయాల ముందు దగాకోరు రేవంత్ ప్రభుత్వం మోకరిల్లక తప్పదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ యువతను జిత్తులమారి ముసలి నక్కలా కాంగ్రెస్ పార్టీ తెలివిగా చిత్తు చేసిందన్నారు.

సరూర్ నగర్ లో యువ సంగ్రామం సదస్సులో మాట్లాడిన కేటీఆర్, 60 ఏళ్లు తెలంగాణ నెత్తురు రుచి మరిగిన కాంగ్రెస్.. కొత్త డూప్లికేట్ రూపాల్లో వచ్చి నకిలీ ప్రేమను కురిపించి యువతను బలిపీఠం ఎక్కించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన యూత్ డిక్లరేషన్ పెద్ద మోసం అన్న కేటీఆర్, ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఓ బురిడీ పత్రాన్ని విడుదల చేశారని మండిపడ్డారు. దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ కు డెత్ డిక్లరేషన్ ఇవ్వాలని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ, ప్రియాంకలు చేసిన మోసాన్ని యువత మార్చిపోదన్న కేటీఆర్, గుర్తుపెట్టుకుని కచ్చితంగా గుణపాఠం చెపుతుందన్నారు.

#Ktr#Brs#Telangana Congress#Cm Revanth Reddy#Jobs#Yuva Sangrama Sadassu#Kcr
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి