క్రైమ్

Sangareddy: సంగారెడ్డిలో దారుణ ఘటన.. పసికందు పాలిట యముడైన తండ్రి!..

రచన: Venu5 నిమిషాల పఠనం

తల్లిదండ్రుల అనాలోచిత నిర్ణయాలు, ఆవేశాలు, పిల్లల పాలిట శాపంగా మారుతున్నాయి.. ఇలాంటి వారి కడుపున పుట్టిన పాపానికి వారి పిల్లలకు కూడా నరకాన్ని చూపించడం కనిపిస్తుంది. లోకం పోకడ తెలియని వయస్సులో లోకాన్నే విడిచిపెట్టే పరిస్థితులు నెలకొంటున్నాయి.

సంగారెడ్డిలో 18 రోజుల పసికందును తండ్రే నేలకేసి కొట్టి చంపిన ఘటన సమాజాన్ని కలిచివేస్తుంది. ఒకప్పుడు ప్రేమ, నమ్మకం, బాధ్యతలపై నిలిచిన భార్యాభర్తల బంధం.. నేడు చిన్న చిన్న విభేదాలు, అహంకారాలు, స్వార్థాల మధ్య నలిగిపోతూ.. ఇలాంటి వారి కడుపున పుట్టిన పాపానికి వారి పిల్లలకు కూడా నరకాన్ని చూపించడం కనిపిస్తుంది. లోకం పోకడ తెలియని వయస్సులో లోకాన్నే విడిచిపెట్టే పరిస్థితులు నెలకొంటున్నాయి. తల్లిదండ్రుల అనాలోచిత నిర్ణయాలు, ఆవేశాలు, పిల్లల పాలిట శాపంగా మారుతున్నాయి..

ప్రేమ వివాహం అయినా, పెద్దలు కుదిర్చిన వివాహం అయినా.. కుటుంబం అంటే పరస్పర గౌరవం, సహనం, బాధ్యత. ముఖ్యంగా ఒక బిడ్డ జన్మించిన తర్వాత తల్లిదండ్రుల ఆలోచనలు తమ వ్యక్తిగత కోపాలను దాటి, ఆ చిన్నారి భవిష్యత్తు వైపు మళ్లాలి. కానీ నేటి సమాజంలో క్షణిక ఆవేశాలు, మానసిక ఒత్తిళ్లు, సంబంధాల్లో పెరుగుతున్న అసహనం.. అమాయక పిల్లల ప్రాణాలనే బలి తీసుకుంటున్నాయి.

ఇక సంగారెడ్డి జిల్లా జోగిపేటలో జరిగిన దారుణం గురించి తెలుసుకుంటే.. జోగిపేట పట్టణానికి చెందిన కృష్ణ, గౌరమ్మలది ప్రేమ వివాహం. కొద్ది కాలం సజావుగా సాగిన వీరి కాపురంలో గత కొన్ని రోజులుగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నేడు (శనివారం) కూడా తన భార్యతో గొడవపడిన కృష్ణ.. పాలు తాగుతున్న బిడ్డను లాక్కొని.. చెంపలపై కొట్టడంతో గౌరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించిందట..

ఆమె మాటలకు కోపోద్రిక్తుడైన కృష్ణ.. చేతిలో ఉన్న పసికందును నేలకేసి కొట్టాడట.. ఊహించని ఈ ఘటనకు షాకైనా అతని భార్య వెంటనే తెరుకుని గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి కృష్ణ పారిపోయాడు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ పసికందును జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించినట్టు సీఐ అనిల్‌ కుమార్‌ వెల్లడించారు. అలాగే నిందితుడు కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.. మరోవైపు సమాజంలో చోటు చేసుకుంటున్న ఇలా సంఘటనలు పలు ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి.

పుట్టి 18 రోజులు కూడా నిండని శిశువు ఏ తప్పు చేసింది? తల్లిదండ్రుల మధ్య తలెత్తిన సమస్యలకు ఆ చిన్నారి ఎందుకు బలికావాలి? ఈ ఘటన ఒక కుటుంబ విషాదం మాత్రమే కాదు.. మానవత్వం ఎంతగా క్షీణిస్తోందో కళ్ళకు కట్టినట్టు చూపించింది. బంధాలను కాపాడుకోవడం, కోపాన్ని నియంత్రించుకోవడం, పిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరించడం నేటి సమాజానికి అత్యవసరమైన సందేశంగా మారింది.

#Telangana#Medak#Sangareddy#Father killd#18-day-old baby
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి