72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. 2024 సంవత్సరానికి ఈ అవార్డులు అనౌన్స్ చేసింది. ‘ఉత్తమ జాతీయ చిత్రం’ అవార్డును బాలీవుడ్ మూవీ ‘ఆర్టికల్ 370’ కైవసం చేసుకుంది. ఉత్తమ నటుడి కేటగిరీలో ఈసారి ఇద్దరు నటులు సంయుక్తంగా అవార్డును అందుకున్నారు. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి (భ్రమ యుగం), బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ (చందు ఛాంపియన్) బెస్ట్ యాక్టర్ అవార్డ్ సొంతం చేసుకున్నారు. 'ఆర్టికల్ 370' చిత్రంలో అద్భుత నటనకు యామి గౌతమ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు.
నేషనల్ బెస్ట్ ఫిలిమ్ ఇదే..
బాలీవుడ్ మూడీ ఆర్టికల్-370 జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారాన్ని సొంతం చేసుకుంది. దీనికి ఆదిత్య సుహాస్ జంభలే డైరెక్టర్. ఉత్తమ నటి అవార్డు యామీ గౌతమీ (ఆర్టికల్-370) దక్కించుకున్నారు.
ఈసారి జాతీయ అవార్డుల వేదికపై తెలుగు సినిమా సత్తా చాటింది. 'పుష్ప 2: ది రూల్', 'కల్కి 2898 ఏడీ', 'కమిటీ కుర్రోళ్లు', 'లక్కీ భాస్కర్', '35 చిన్న కథ కాదు' చిత్రాలు పలు విభాగాల్లో పురస్కారాలు గెలుచుకుని తెలుగు సినిమా కీర్తిని ఇనుమడింపజేశాయి.
‘కమిటీ కుర్రాళ్లు’ ఉత్తమ తెలుగు చిత్రంగా నిలవడంతో పాటు బెస్ట్ మేకప్ అవార్డును సొంతం చేసుకుంది. ‘కల్కి 2898 AD’ బెస్ట్ పాపులర్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రంగా, ‘పుష్ప 2’ సినిమాకు సుకుమార్ బెస్ట్ స్క్రీన్‌ప్లే విభాగంలో అవార్డులను దక్కించుకున్నారు.
ఉత్తమ దర్శకుడు విభాగంలో తమిళ చిత్రం ‘అమరన్’కు దర్శకత్వం వహించిన రాజ్‌కుమార్ పెరియసామి జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఉత్తమ బాలల చిత్రం విభాగంలో తెలుగు సినిమా ‘35 చిన్న కథ కాదు’ జాతీయ అవార్డుకు ఎంపికైంది.
ఉత్తమ ఫీచర్ ఫిల్మ్: ఆర్టికల్ 370 (హిందీ)
ఉత్తమ దర్శకుడు: రాజ్ కుమార్ పెరియసామి (అమరన్- తమిళం)
ఉత్తమ ప్రజాదరణ పొందిన వినోదాత్మక చిత్రం: కల్కి 2898 ఏడీ (తెలుగు)
ఉత్తమ నటుడు (సంయుక్తంగా):
మమ్ముట్టి (భ్రమ యుగం-మలయాళం)
కార్తీక్ ఆర్యన్ (చందూ ఛాంపియన్- హిందీ)
ఉత్తమ నటి: యామి గౌతమ్ (ఆర్టికల్ 370- హిందీ)
ప్రాంతీయ భాషల్లో ఉత్తమ తెలుగు చిత్రం: కమిటీ కుర్రోళ్లు
పుష్ప-2కు రెండు అవార్డులు..
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డ్ (దీపాలీ నూర్, శీతల్ శర్మ)
బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ (సుకుమార్)
ఇక బెస్ట్ తెలుగు ఫిలిమ్ గా కమిటీ కుర్రోళ్లు ఎంపికైంది. దీనికి యదు వంశీ దర్శకత్వం వహించారు.












