National

అభిజిత్ దీప్కేకు చేదు అనుభవం.. మహిళ చేసిన పనికి అంతా షాక్

రచన: NK3 నిమిషాల పఠనం

పరీక్షల్లో అవకతవకలు, నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారానికి వ్యతిరేకంగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు జంతర్ మంతర్ నుండి తరలించి సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి చేర్చిన సంగతి తెలిసిందే.

Abhijeet Dipke: కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కేకు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఓ మహిళ అనూహ్యంగా అతడి ముఖంపై ఇంక్ పోసింది. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. సోనమ్ వాంగ్ చుక్ దీక్ష భగ్నం కావడంతో అభిజిత్ దీప్కే నిరాహార దీక్షను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

జంతర్ మంతర్ వద్ద భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేపై ఒక మహిళ సిరా (ఇంక్) విసరడం కలకలం రేపింది. ఈ ఘటనతో కార్యక్రమానికి కాసేపు అంతరాయం కలిగింది. అభిజిత్ మద్దతుదారులు వేదిక వైపు దూసుకెళ్లడంతో అక్కడ గందరగోళం నెలకొంది. కాగా, ఇంక్ చల్లిన ఆ మహిళ ఎవరు, ఎందుకు ఇలా చేశారు? అనే వివరాలు తెలియాల్సి ఉంది.

పరీక్షల్లో అవకతవకలు, నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారానికి వ్యతిరేకంగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు జంతర్ మంతర్ నుండి తరలించి సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి చేర్చిన సంగతి తెలిసిందే. సోమవారం ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజున చేపట్టాలని తలపెట్టిన 'పార్లమెంట్ మార్చ్'కు 48 గంటల ముందు వాంగ్‌చుక్‌ను దీక్షా వేదిక నుండి పోలీసులు తరలించారు.

ఈ లింక్ ఓపెన్ చేసి వీడియో చూడొచ్చు..

https://x.com/PTI_News/status/2078386536929006020

#Abhijeet Dipke#Ink#Delhi#Protest#Jantar Mantar#Cockroach Janata Party#CJP
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి