National

రూ.3కోట్లు.. బిహార్ యువతి ప్రతిభ.. ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్‌కు ఎంపికైన ఏకైక ఇండియన్

రచన: NK5 నిమిషాల పఠనం

లింకన్ స్కాలర్‌షిప్ అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక అండర్‌గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్. దీనికి యునైటెడ్ స్టేట్స్ 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ గౌరవార్థం ఆయన పేరు పెట్టారు. ప్రతి సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా కేవలం 10 మంది విద్యార్థులను మాత్రమే ఈ కార్యక్రమానికి ఎంపిక చేస్తారు.

బిహార్‌కు చెందిన యువతి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపింది. తన టాలెంట్‌తో ప్రతిష్టాత్మక లింకన్ స్కాలర్‌షిప్‌కు ఎంపికైంది శ్రేయా కౌశిక్. ఈ స్కాలర్‌షిప్ విలువ రూ.3 కోట్లు. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికై ఈ ఘనత సాధించిన ఏకైక ఇండియన్ గా నిలిచింది శ్రేయా. అమెరికాలోని కెంటకీలో ఉన్న సెంటర్ కాలేజీలో ఉచిత విద్య అందించేందుకు ఈ స్కీమ్ కింద ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 10 మందిని ఎంపిక చేస్తారు. ఆ 10 మంది శ్రేయా కౌశిక్ ఒకరిగా నిలిచారు. కాగా, శ్రేయా గతంలో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపారు. ఇప్పుడు ప్రతిష్టాత్మక స్కాలర్ షిప్ కు ఎంపికయ్యారు. ఈ స్కాలర్ షిప్ కు ఎంపిక కావడంపై ఆమె స్పందించారు. ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని చెప్పారు.

లింకన్ స్కాలర్‌షిప్ అనేది అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ గౌరవార్థం పేరు పెట్టబడిన, అత్యంత పోటీతో కూడిన, పూర్తి నిధులతో నడిచే ఒక ప్రపంచవ్యాప్త అండర్ గ్రాడ్యుయేట్ కార్యక్రమం. లింకన్ స్కాలర్స్ ప్రోగ్రామ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కేవలం 10 మందిని మాత్రమే ఎంపిక చేస్తారు. అమెరికాలోని కెంటకీలో ఉన్న సెంటర్ కాలేజీలో బ్యాచిలర్ డిగ్రీ (నాలుగేళ్లు) పూర్తి ఖర్చును భరిస్తుంది.

బిహార్‌లోని సివాన్‌కు చెందిన 18 ఏళ్ల విద్యార్థిని శ్రేయా కౌశిక్ ప్రతిష్టాత్మక 'లింకన్ స్కాలర్‌షిప్'కు ఎంపిక కావడం పట్ల ఆమె కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఈ స్కాలర్‌షిప్ పొందిన వారిలో ఆమె ఏకైక భారతీయురాలు అని గర్వంగా చెప్పారు. సుమారు రూ. 3 కోట్ల విలువైన ఈ స్కాలర్‌షిప్, అమెరికాలోని సెంటర్ కాలేజీలో ఆమె అండర్ గ్రాడ్యుయేట్ చదువుకి ఆర్థిక సహకారాన్ని అందిస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ప్రతిభావంతులైన విద్యార్థుల బృందానికి ఈ లింకన్ స్కాలర్‌షిప్‌ను ఏటా ప్రదానం చేస్తుందని వివరించారు. శ్రేయా అత్యుత్తమ ప్రతిభను, నాయకత్వ సామర్థ్యాన్ని వారు మెచ్చుకున్నారు. అంతర్జాతీయ విద్యా రంగంలో శ్రేయా ఎంపిక భారత దేశానికి ఒక గొప్ప విజయం అని అభివర్ణించారు.

ఏంటీ లింకన్ స్కాలర్‌షిప్?

లింకన్ స్కాలర్‌షిప్ అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక అండర్‌గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్. దీనికి యునైటెడ్ స్టేట్స్ 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ గౌరవార్థం ఆయన పేరు పెట్టారు. ప్రతి సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా కేవలం 10 మంది విద్యార్థులను మాత్రమే ఈ కార్యక్రమానికి ఎంపిక చేస్తారు.

ఈ స్కాలర్‌షిప్, అమెరికాలోని కెంటకీలో ఉన్న సెంటర్ కాలేజీలో నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ కోసం పూర్తి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ట్యూషన్ ఫీజులు, వసతి, భోజనం, పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్, ఆరోగ్య బీమా, ప్రయాణ ఖర్చులు ఇతర వ్యక్తిగత ఖర్చులను భరిస్తుంది.

వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి