ఉత్తరప్రదేశ్ లోని బహ్రెయిచ్ జిల్లాలో దారుణం జరిగింది. 12 ఏళ్ల బాలుడిని మొసలి చంపి తినేసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 12 ఏళ్ల బాలుడు కాళ్లు, చేతులు కడుక్కుందామని నదిలోకి దిగాడు. అంతే.. సడెన్ గా మొసలి దాడి చేసింది. బాలుడిని నీళ్లలోకి లాకెళ్లింది. అతడి చంపి తినేసింది. బాలుడు తన బాబాయ్ తో కలిసి పొలానికి వెళ్లాడు. అక్కడ పనులు ముగించుకుని తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో కాళ్లు చేతులు కడుక్కుందామని బాలుడు నదిలోకి దిగాడు. ఇంతలో మొసలి వచ్చి దాడి చేసింది. బాలుడిని తన నోటితో పట్టుకున్న మొసలి.. నదిలోకి తీసుకెళ్లింది. ఆ తర్వాత అతడిని పలుమార్లు విసిరికొట్టింది. అనంతరం నడుము కింది భాగం వరకు తినేసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వరి పొలంలో పని ముగించుకుని చేతులు, కాళ్లు కడుక్కుంటున్న 12 ఏళ్ల బాలుడిని మొసలి ఘఘరా నదిలోకి లాక్కెళ్లి చంపేసింది. బాలుడిని రక్షించేందుకు అతని మామ, గ్రామస్తులు తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఆ మొసలి బాలుడిని తీసుకుని లోతైన నీటిలోకి వెళ్లిపోయింది. దాదాపు ఐదు గంటల తర్వాత బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు.
జిల్లా కేంద్రానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలోని బౌండి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. గురువారం మధ్యాహ్నం వరి నాట్లు వేసే పనిలో సాయం చేసేందుకు బాలుడు తన మామతో కలిసి వరి పొలానికి వెళ్లాడు. పొలంలో దాదాపు మూడు నాలుగు గంటల పాటు పని చేసిన తర్వాత, ఇంటికి తిరిగి వస్తుండగా వారు చేతులు, కాళ్లు కడుక్కోవడానికి ఘఘరా నదీ తీరంలో ఆగారు.
సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో మొసలి నదిలోంచి అకస్మాత్తుగా బయటకు వచ్చి ఆ బాలుడి కాలు పట్టుకుని నీటిలోకి లాక్కెళ్లింది.
ఆ బాలుడు విడిపించుకోవడానికి తీవ్రంగా పోరాడాడు. అతని మామ గట్టిగా కేకలు వేశాడు. ఆ కేకలు విన్న సమీపంలోని రైతులు, గ్రామస్తులు పరిగెత్తుకొచ్చారు. బాలుడిని వదిలిపెట్టేలా మొసలిపై రాళ్లు, ఇటుకలు విసిరారు. అయినప్పటికీ, ఆ మొసలి బాలుడిని లోతైన నీటిలోకి లాక్కెళ్లే ముందు, అతడిని నీటిలో చాలాసార్లు విసిరి కొట్టింది. గ్రామస్తులు ఎన్ని ప్రయత్నాలు చేసినా బాలుడిని కాపాడలేకపోయారు.
బాలుడి ఆచూకీ కోసం గ్రామస్తులు పెద్ద వెదురు కర్రలను ఉపయోగించి గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు ఐదు గంటల తర్వాత రాత్రి సుమారు 10 గంటలకు బాలుడి మృతదేహం నదిలో లభ్యమైంది.
''మొసలి మృతదేహాన్ని పాక్షికంగా తినేసింది. మృతుడి కుడి కాలు, నడుము కింది భాగం తీవ్రంగా ఛిద్రమయ్యాయి. మృతుడు ఆరో తరగతి విద్యార్థి. కొన్ని సంవత్సరాల క్రితం తన తల్లిదండ్రులను అతడు కోల్పోయాడు. అతనికి ఒక సోదరుడు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. ప్రస్తుతం అతడు తన మామ దగ్గర ఉంటున్నాడు'' అని ఫారెస్ట్ రేంజర్ సాకిబ్ అన్సారీ తెలిపారు.
నీళ్లలోకి దిగిన బాలుడిని మొసలి లాక్కెళ్లి చంపి తినేసిన ఘటన గ్రామస్తులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. తమ కళ్ల ముందే జరిగిన ఘోరాన్ని చూసి వారు తట్టుకోలేకపోతున్నారు. కాగా, ఘాగ్రా నదిలో మొసళ్లు ఉన్నాయి. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ, నది వెంబడి ఉన్న గ్రామాల్లోని నివాసితులు తమ దైనందిన కార్యకలాపాల కోసం తరచుగా నదిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి.
వరి పొలంలో పని ముగించుకుని చేతులు, కాళ్లు కడుక్కుంటున్న 12 ఏళ్ల బాలుడిని మొసలి ఘఘరా నదిలోకి లాక్కెళ్లి చంపేసింది. బాలుడిని రక్షించేందుకు అతని మామ, గ్రామస్తులు తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
ఈ లింక్ ఓపెన్ చేసి వీడియో చూడొచ్చు..
https://x.com/Deb_livnletliv/status/2078100100220670454/video/1












