The Rajasaab: బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన ఒక సినిమా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌పైకి వచ్చేసరికి సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని ఎవరైనా ఊహిస్తారా? అదీ 'రెబల్ స్టార్' ప్రభాస్ నటిస్తే ఆ లెక్కలే వేరుగా ఉంటాయని మరోసారి రుజువైంది. థియేటర్లలో ఆడియన్స్‌ను మెప్పించలేకపోయిన ఆయన లేటెస్ట్ మూవీ 'ది రాజా సాబ్', ప్రస్తుతం ఓటీటీ వేదికగా సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. మారుతి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం వెండితెరపై తీవ్రంగా నిరాశపరిచిన , స్మాల్ స్క్రీన్‌పై మాత్రం వ్యూవర్షిప్ సునామీ సృష్టిస్తూ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
సాధారణంగా భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాలను ఓటీటీలో పెద్దగా పట్టించుకోరు. కానీ ప్రభాస్ క్రేజ్ ముందు ఆ లాజిక్కులేవీ పనిచేయలేదు. బాక్సాఫీస్ రన్‌లో రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినప్పటికీ, భారీ బిజినెస్ కారణంగా ఈ సినిమా నిర్మాతలకు నష్టాలనే మిగిల్చింది. అయితే, థియేటర్లలో మిస్ అయిన ఆడియన్స్ అంతా ఈ చిత్రాన్ని డిజిటల్ స్క్రీన్స్ పై చూడటానికి ఎగబడ్డారు. ఫలితంగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ ఏడాది హయ్యెస్ట్ వ్యూవర్ షిప్ సాధించిన నంబర్ వన్ సినిమాగా 'ది రాజా సాబ్' సరికొత్త రికార్డును ఖాతాలో వేసుకుంది.
ఈ ఏడాది ప్రారంభంలోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడం ఈ సినిమాకు బాగా ప్లస్ అయింది. ఇప్పటివరకు ఈ చిత్రం ఏకంగా 17.5 మిలియన్ల వ్యూస్ మార్క్‌ను అందుకొని డిజిటల్ దుమ్ముదులిపేసింది. రెండో స్థానంలో ఉన్న మలయాళ సూపర్ హిట్ మూవీ ‘ద్రిడం’ (8.5 మిలియన్ వ్యూస్) కంటే చాలా ఎక్కువ మార్జిన్‌తో ప్రభాస్ సినిమా టాప్‌లో దూసుకుపోతోంది. అట్టర్‌ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఒక సినిమాకు డిజిటల్ మీడియాలో ఈ స్థాయి రెస్పాన్స్ రావడం టాలీవుడ్‌లోనే ఒక సంచలనం. ఈ దెబ్బతో బాక్సాఫీస్ క్లాస్ ఎలా ఉన్నా, ప్రభాస్ మాస్ ఫాలోయింగ్ రేంజ్ ఏంటో మరోసారి ప్రూవ్ అయింది. ఇక ఇయర్ ఎండ్‌లో రాబోతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఫౌజీ'తో రెబల్ స్టార్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడోనని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.












