ఏపీ

Ap : గుంటూరులో దారుణం.. సభ్యసమాజం తలదించుకునేలా టీడీపీ నేతల దాడి

రచన: Kumar3 నిమిషాల పఠనం

ఏపీలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష వైసీపీ నేతలు తీవ్రవిమర్శలు చేస్తున్నారు. తమ నేతల మీద విచక్షణా రహితంగా దాడులకు పాల్పడుతున్నారని, పోలీసులు సైతం వారికే వంత పడుతున్నారని మండిపడుతున్నారు.

ఏపీలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష వైసీపీ నేతలు తీవ్రవిమర్శలు చేస్తున్నారు. తమ నేతల మీద విచక్షణా రహితంగా దాడులకు పాల్పడుతున్నారని, పోలీసులు సైతం వారికే వంత పడుతున్నారని మండిపడుతున్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పిందని, ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులే దాడులకు పాల్పడుతున్నవారికి అండగా నిలుస్తున్నారని ఫైర్ అవుతున్నారు.

ప్రతిపక్షాల విమర్శల వేళ ఏపీలోని గుంటూరులో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మహిళను నడిరోడ్డుపై వివస్త్రను చేసి ఓ టీడీపీ నాయకుడు దాడి చేసినట్టు తెలుస్తోంది. కృష్ణబాబు కాలనీలో ఈ నెల 15న ఇంటి ముందు కుళాయి నుంచి మోటార్ ద్వారా నీళ్ళు పట్టుకుంటున్న మహిళతో 21వ డివిజన్ టీడీపీ కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తి వాగ్వాదానికి దిగినట్టు తెలిసింది.

https://x.com/TeluguScribe/status/2078341748330582343?s=20

అదికాస్త తీవ్ర మనస్పర్దలకు దారితీసింది.దీంతో కోపోద్రిక్తుడైన వెంటకరమణమూర్తి..సదరు మహిళను, ఆమె కుటుంబసభ్యుడిని వెంటపడి కొట్టి.. ఆమెను నడిరోడ్డుపై వెంకటరమణమూర్తి, అతని సోదరి వివస్త్రను చేసినట్టు తెలిసింది. వదిలి పెట్టాలని వేడుకున్నా కనికరించకుండా దాడి చేసిన టీడీపీ నాయకుడు వివస్త్రను చేసినట్టు స్థానికంగా టాక్ వినిపిస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం..ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో వెంకటరమణమూర్తిని పార్టీ నుండి సస్పెండ్ చేసినట్టు స్థానిక వెస్ట్ ఎమ్మెల్యే గళ్ల మాధవి ప్రకటించారు. బాధితురాలి ఫిర్యాదుతో మూర్తి, అతని సోదరితో కలిపి 9 మందిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

#Women beaten#remove cloths#andrapradesh#tdp leaders
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి