సినిమా

The Odyssey: తెలుగోళ్లు సైతం మెచ్చిన ఈ సినిమాలో అస‌లేముంది..?

రచన: Anshu5 నిమిషాల పఠనం

The Odyssey: క్రిస్టోఫర్ నోలన్ సినిమా వస్తోందంటేనే ప్రపంచవ్యాప్తంగా సినిమా లవర్స్‌లో ఒక రకమైన ఊపు వస్తుంది. అయితే ఈసారి ఆయన ఎంచుకున్న సబ్జెక్ట్, దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం హాలీవుడ్ ప్రేక్షకులను మాత్రమే కాదు, పక్కా కమర్షియల్, మాస్ సినిమాలను ప్రాణంగా ప్రేమించే తెలుగు ఆడియెన్స్‌ను కూడా అమితంగా ఆకట్టుకుంటోంది. గ్రీక్ ఇతిహాసం ఆధారంగా దాదాపు రూ. 2200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ది ఒడిస్సీ’ సినిమా అసలు మనవాళ్లకు ఎందుకు అంతగా కనెక్ట్ అయింది? ఇందులో ఉన్న ఆ ప్రత్యేకతలు ఏంటో చూద్దాం.

తెలుగు ప్రేక్షకులకు పౌరాణికాలు, జానపద కథలు, ఇతిహాసాలు కొత్త కాదు. 'ది ఒడిస్సీ' మూలకథ కూడా దాదాపు 3000 ఏళ్ల నాటి గ్రీక్ పురాణాలకు సంబంధించింది. ఒక రాజు తన భార్యాపిల్లల కోసం, తన రాజ్యం కోసం సముద్రాలు దాటి పది సంవత్సరాల పాటు పోరాటం చేస్తూ ఇంటికి తిరిగి వచ్చే ప్రయాణమే ఈ సినిమా. ఈ లైన్ వినడానికి మనకు రాముడి వనవాసం లాగో, లేదా అరణ్యవాసం ముగించుకుని వచ్చే పాండవుల కథ లాగో అనిపిస్తుంది. ఈ ప్యామిలీ ఎమోషన్, లాయల్టీ, హోమ్‌కమింగ్ అనే పాయింట్స్ తెలుగు ప్రేక్షకుల హృదయాలకు పర్ఫెక్ట్‌గా టచ్ అయ్యాయి.

క్రిస్టోఫర్ నోలన్ అంటే సాధారణంగా టైం ట్రావెల్, సైన్స్ ఫిక్షన్, బుర్ర బద్దలయ్యే స్క్రీన్ ప్లేలు గుర్తుకొస్తాయి. కానీ ఈ సినిమాలో ఆయన రూట్ మార్చి, పూర్తిస్థాయి యాక్షన్ ఫాంటసీ జోనర్‌ను ఎంచుకున్నారు. కథానాయకుడు ఒడిస్సియస్ (మ్యాట్ డామన్) తన ప్రయాణంలో ఒంటికన్ను రాక్షసులతో, మాయా కన్యలతో, సముద్ర దేవుడి ఆగ్రహంతో పోరాడే సీన్లు థియేటర్లలో విజిళ్లు వేయిస్తున్నాయి. మన ఊరు రికార్డులు తిరగరాసే మాస్ హీరోలా.. ఇక్కడ నోలన్ హీరో కూడా ప్రకృతి శక్తులతో, రాక్షసులతో తలపడడం మన మాస్ ఆడియెన్స్‌కు విపరీతంగా నచ్చేసింది.

అలాగే ఈ సినిమాను కేవలం చూడడం కాదు, ఒక సరికొత్త లోకంలోకి వెళ్లి అనుభూతి చెందాలి. పూర్తిగా ఐమ్యాక్స్ 70mm ఫిల్మ్ కెమెరాలతో తీయడం వల్ల గ్రీస్, ఇటలీ అందాలతో పాటు భీకరమైన సముద్రపు తుపాన్లు, షిప్‌రెక్స్ సీన్లు థియేటర్లలో కూర్చున్న ప్రేక్షకుడికి రోమాంచం కలిగిస్తాయి. దీనికి తోడు లూడ్విగ్ గోరాన్సన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లను షేక్ చేస్తోంది. లార్జర్ దాన్ లైఫ్ సినిమాలను ఇష్టపడే తెలుగు వారికి ఈ విజువల్ వండర్ ఒక పండుగలా అనిపించడంలో ఆశ్చర్యం లేదు.

సినిమా రన్‌టైమ్ దాదాపు 2 గంటల 52 నిమిషాలు ఉండడం, అక్కడక్కడా నోలన్ మార్క్ ఫ్లాష్‌బ్యాక్ టైమ్‌లైన్స్ వల్ల కొంతమంది పేసింగ్ కొంచెం నెమ్మదించిందని అంటున్నప్పటికీ.. ఓవరాల్‌గా మాత్రం ఇదొక మైండ్ బ్లోయింగ్ సినిమాటిక్ స్పెక్టాకిల్ అని ప్రశంసిస్తున్నారు. తెలుగు డబ్బింగ్ కూడా క్వాలిటీగా కుదరడం ఈ సినిమాకు ఇక్కడ మరింత ప్లస్ అయింది. అందుకే హైదరాబాద్ లాంటి నగరాల్లో ఐమ్యాక్స్ స్క్రీన్ల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ను లవ్ చేసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పెద్ద స్క్రీన్‌పై చూడాల్సిన బొమ్మ ఇది.

#TheOdyssey#ChristopherNolan#TomHolland#TheOdyssey2026 film
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి