Spirituality

Spirituality: మరణం అంటే ఏమిటి..? తెలియని రహస్యం.. నమ్మలేని నిజం!..

రచన: Venu6 నిమిషాల పఠనం

మరణం అనేది జీవులందరికీ ఎదురయ్యే ఒక అనివార్యం. కానీ, ఆ క్షణంలో ఏం జరుగుతుందనేది ఎప్పుడూ ఒక రహస్యమే. కానీ కొందరు మాత్రం మరణం అంటే మనిషికి లభించే ఒక శాశ్వతమైన నిద్ర అని అంటున్నారు.

ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి లైఫ్ కి ఒక ఎండ్ కార్డ్ ఉంటుంది.. అలాంటి ప్రాణులలో మనిషిని ప్రత్యేకంగా పేర్కొనవచ్చు.. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన ప్రాణులకంటే మానవుని జీవితం భిన్నంగా ఉండి.. తన ఆలోచనలతో అద్భుతాలను సృష్టిస్తున్నాడు.. కానీ నేటి వరకు మరణంలోని రహస్యాన్ని చేధించడంలో వెనుకబడే ఉన్నాడు..

అయితే ఎందరో పండితులు, మేధావులు ఈ మిస్టరీని వివిధ కోణాల్లో ఇప్పటి వరకు వివరించే ప్రయత్నాలు చేశారు.. చేస్తున్నారు కూడా.. మరోవైపు శాస్త్రజ్ఞులు సైతం మరణం లేకుండా జీవించడం ఎలా అనే అంశం పై పరిశోధనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.. మరణం అనేది విధి ఆడే ఆట అని.. ఇదంతా శివుడి లీల అని ఆధ్యాత్మిక వేత్తలు ప్రస్తావించడం తెలిసిందే..

ఇక ఇతర మతాల వారు కూడా వారి విశ్వాసాల ప్రకారం మరణానికి అర్థాలను చెప్పడం కనిపిస్తుంది.. అలాగే మనిషి మరణించే ముందు ఏం జరుగుతుంది అనే అంశం పై కూడా ఇప్పటి వరకు ఎన్నో కథనాలు వచ్చాయి.. అయితే ఈ విషయంలో ఎవ్వరూ సరైన క్లారిటీ ఇవ్వక పోవడం కనిపిస్తుంది.. కానీ కొందరు వ్యక్తుల అనుభవాల ప్రకారం..

మరణం అనేది జీవులందరికీ ఎదురయ్యే ఒక అనివార్యం. కానీ, ఆ క్షణంలో ఏం జరుగుతుందనేది ఎప్పుడూ ఒక రహస్యమే. కానీ కొందరు మాత్రం మరణం అంటే మనిషికి లభించే ఒక శాశ్వతమైన నిద్ర అని అంటున్నారు. అయితే మరణం సమీపించిన ఆఖరి క్షణాల్లో శరీరం విపరీతంగా అలసిపోతుంది. కనురెప్పలు భారమై మగతగా వాలిపోతుంటాయి. బుద్ధి నెమ్మదిస్తుంది, చుట్టూ ఉన్న ప్రపంచం అస్పష్టంగా మారుతుందట.

అప్పుడు దేహానికి ఏదో జరుగుతోందనే స్పృహ ఉంటుంది, కానీ దానిని వ్యక్తపరిచే ఓపిక, శక్తి ఆ శరీరానికి ఉండవు. అది మాటలకు అందని ఒక నిశ్శబ్ద స్థితి. సరిగ్గా అదే సమయంలో.. ఈ భౌతిక శరీరానికి, అందులోని ఆత్మకు ఉన్న కనెక్టివిటీ నెమ్మదిగా తెగిపోవడం మొదలవుతుంది. ఎలాగంటే.. పాలు తాగే పసిపిల్లాడు ఆటల్లో పడి తల్లిని విడిచిపెట్టి, ఆ తర్వాత ఆమె కోసం వెతుకుతూ.. వెతుకుతూ.. చివరికి దారి తప్పిపోయి, శాశ్వతంగా దూరమైపోతే ఎంతటి వేదన ఉంటుందో, శరీరాన్ని వదిలిన ఆత్మ స్థితి కూడా అలాగే ఉంటుందని వివరిస్తున్నారు.

అలా దేహం నుండి విడిపోయిన ఆత్మ, తను ఇంతకాలం నివసించిన ఆ గూటిని (శరీరాన్ని) వదిలి వెళ్లలేక తల్లడిల్లుతుంది. తిరిగి ఆ దేహంలోకి ప్రవేశించాలని శతవిధాలా ప్రయత్నిస్తుంది. కానీ, అప్పటికే పంచభూతాల ఆధీనంలోకి వెళ్లిన ఆ శరీరం సహకరించదు. కదలలేదు, మెదలలేదు. ఆత్మ ఎంత ప్రయత్నించినా.. శరీరం సహకరించక, ఆ దేహంలోకి తిరిగి ప్రవేశించలేక, శాశ్వతంగా దూరం అయిపోయినప్పుడు కలిగే ఆ శూన్య స్థితినే మరణం అంటాము.

ఇది కేవలం ఊహ కాదు. ప్రమాదాల బారినపడి చావు అంచుల వరకు వెళ్ళి బ్రతికిన వాళ్ళు.. గుండె ఆగిపోయి మళ్లీ బతికిన కొందరు వ్యక్తులు తమ ఆత్మ శరీరం నుండి బయటకు వచ్చి, పైన తేలుతూ తన సొంత శరీరాన్ని తానే చూసుకున్నట్టు, మళ్లీ లోపలికి రావడానికి ప్రయత్నించిన అనుభవాలు ఎదుర్కొన్నట్టు పేర్కొన్నారు. అలాగే భగవద్గీతలో కూడా మరణానికి సంబంధించిన అంశాన్ని వివరించడం తెలిసిందే..

ఇక మనస్సు పెట్టి ఆలోచిస్తే ఈ సృష్టిలో ప్రతిదీ ఒక అద్భుతమే.. అందుకే కొన్ని విషయాలు ఇప్పటికీ రహస్యంగా మిగిలి.. సమాధానం లేని ప్రశ్నలా మారినట్టు చెబుతుంటారు.. మొత్తానికి మానవునికి సృష్టి రహస్యాన్ని చేధించడం సాధ్యమా? అంటే.. అవునని చెప్పే పరిస్థితి లేదని తెలుస్తుంది.. మరణం అనేది అంతం కాదు, అది కేవలం దేహ మార్పిడి మాత్రమే. అలసిపోయిన పాత వస్త్రాన్ని వదిలేసి, ఆత్మ తన శాశ్వత గమ్యం వైపు సాగిపోయే ఒక నిశ్శబ్ద ప్రయాణం అని అర్థం అవుతుంది. !

#india#Spirituality#Death Experiences#unknown mystery#unbelievable truth
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి