సినిమా

Varanasi: AI వాయిస్‌లను రిజెక్ట్ చేసిన రాజమౌళి!1500 రియల్ వాయిస్‌లే

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Varanasi: వారణాసి సినిమా గురించి ఏ చిన్న వార్త వచ్చినా అది అందరిలో హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమాను ప్రపంచ దేశాలలో రిలీజ్ చేయబోతుండటం రాజమౌళి ధైర్య-సాహసాలకి పెద్ద పరీక్షగా మారింది. ఇప్పటి వరకూ జక్కన్న తీసిన సినిమాలన్నీ ఒకెత్తైతే, ఇప్పుడు చేస్తున్న వారణాసి సినిమా ఒక్కటే ఒకెత్తు. రాజమౌళి..బాహుబలి నుంచి తీస్తున్న ప్రతీ సినిమాను ఓ విజువల్ వండర్‌గా రూపొందిస్తున్నాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న వారణాసి సినిమాకి సంబందించిన ఓ లేటెస్ట్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమా కోసం నిన్నా మొన్నటి వరకూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిస్‌లను ఉపయోగించబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ, అది పూర్తిగా అవాస్తవం అని తెలుస్తోంది. ఈ సినిమా కోసం 1500 మంది డబ్బింగ్ ఆర్టిస్టుల వాయిస్‌లను టెస్ట్ చేశారట. ఒరిజినల్ వాయిస్‌లతోనే డబ్బింగ్ చెప్పించనున్నట్టు తెలుస్తోంది.

ఇక, వారణాసి సినిమాను 120 దేశాలలో 20 భాషలలో రిలీజ్ చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రచారం జరుగుతుండగా ఈ వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే, ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం 20 కాదు 50 భాషలలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళం భాషలతో పాటు జపనీస్, ఫ్రెంచ్, స్పానిష్, అరబిక్ వంటి అనేక అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమా సందడి చేయనుంది.

ఇక, ఈ సినిమాలో మహేష్.. రుద్ర, శ్రీరాముడు పాత్రల్లో కనిపించబోతున్నాడు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మందాకినిగా అలరించనుంది. పృథ్వి రాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో విలనిజం చూపించబోతున్నాడు. ఈ మూడు పాత్రల చుట్టూనే కథ నడవనుంది. ఇక, వారణాసి ఎపిసోడ్, ఆఫ్రికా ఎపిసోడ్ సినిమాకి హైలెట్‌గా నిలవనున్నాయి. సంగీతం ఎం.ఎం.కీరవాణి అందిస్తున్న సంగతి తెలిసిందే.

#varanasi#maheashbabu#rajamouli#priyanka chopra#mmkeeravani
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి