తెలంగాణ

Eatala Rajender: జాతిని విచ్ఛిన్నం చేసే ఫౌండేషన్‌తో మీకేం పని? సీఎం రేవంత్ పై ఈటల ఫైర్

రచన: NK••4 నిమిషాల పఠనం

Eatala Rajender: తన అమెరికా పర్యటన రద్దు వెనుక రాజకీయ కోణం ఉందని, ప్రధాని మోదీ ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నారని, తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ నాంపల్లి బీజేపీ కార్యాలయంలో ఆయ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ పై ఎదురు దాడికి దగారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై రేవంత్ చేసిన ఆరోపణలను ఈటల ఖండించారు.

గ్రోత్ రేట్ పై చర్చకు సిద్ధమా?

సీఎం రేవంత్ భాష అత్యంత నీచంగా, జుగుప్సాకరంగా ఉందని మండిపడ్డారు. గూట్లో రాయి తీయలేనొడు ఏట్లో రాయి తీస్తా అన్నాడట అట్లా ఉంది రేవంత్ తీరు అని ఎద్దేవా చేశారు. ఆక్స్ ఫర్డ్, విదేశీ చదువులు అని రేవంత్ అంటున్నారు.. అంతకంటే ముందు నుంచే నలందా, తక్షశిల లాంటి మన విద్యా సంస్థలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. జాతిని విచ్ఛిన్నం చేసే జార్జి సొరస్ ఫౌండేషన్ తో మీకు ఏం పని? అని రేవంత్ ను ప్రశ్నించారు. ప్రధాని మోదీని టెర్రరిస్ట్ తో పోల్చిన మేయర్ మామ్డానిని ఎందుకు కలవాలి అనుకున్నారో చెప్పాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. వాళ్ళ గ్రోత్ రేట్, మన గ్రోత్ రేటు మీద చర్చకు సిద్ధమా? అని ముఖ్యమంత్రి రేవంత్ కు సవాల్ విసిరారు ఎంపీ ఈటల రాజేందర్.

మీదంతా చీకటి పాలన.. స్కామ్ లే తప్ప స్కీములు లేవు

చీకటి పాలనకి కేరాఫ్ కాంగ్రెస్ పాలన అని విరుచుకుపడ్డారు. మీ పాలనలో స్కామ్ లు తప్ప స్కీంలు లేవని ధ్వజమెత్తారు. స్కూల్స్ లో టాయిలెట్స్ కట్టించలేని విద్యాశాఖ మంత్రిగా సిగ్గుతో తల దించుకోవాలని సీఎం రేవంత్ పై మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి అబద్ధాలు చెప్పడమే ఫిలాసఫీ అని విరుచుకుపడ్డారు. పచ్చ కామెర్లతో మోదీని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమ్మీద నడవాలని, తెలంగాణ ప్రజల పరువు తీయొద్దని సీఎం రేవంత్ ను కోరారు ఎంపీ ఈటల రాజేందర్.

#Eatala Rajender#Bjp#Telangana#Congress#Cm Revanth Reddy#PM Modi#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి