తెలంగాణ

Cm Revanth Reddy: భూసేకరణపై నిర్లక్ష్యం వహిస్తే ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తి కావు- ప్రజాప్రతినిధులతో సీఎం రేవంత్

రచన: NK•••4 నిమిషాల పఠనం

Cm Revanth Reddy: శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులకు వివరించారు. బ్రిటన్ పర్యటన ముగించుకుని తిరిగి హైదరాబాద్ కు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్.. అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమావేశమయ్యారు.

* సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

* అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ భూసేకరణ పనులు వేగంగా పూర్తి చేయాలి

* భూసేకరణపై నిర్లక్ష్యం వహిస్తే ఎప్పటికీ ప్రాజెక్టులు పూర్తి కావు

* భూసేకరణ, R&R, ఫారెస్ట్ క్లియరెన్సులకి సంబంధించి నిధులను వెంటనే మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధం

* ప్రతీ ఒక్కరూ నియోజకవర్గ అభివృద్ధిపై ఫోకస్ పెట్టండి

* ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్

Cm Revanth Reddy: శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులకు వివరించారు. బ్రిటన్ పర్యటన ముగించుకుని తిరిగి హైదరాబాద్ కు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్.. అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమావేశమయ్యారు.

ప్రజాప్రతినిధులందరూ నియోజకవర్గాల అభివృద్ధిపై ఫోకస్ పెంచాలని ఈ సందర్భంగా సూచించారు. ప్రధానంగా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ పనులు వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. భూసేకరణపై నిర్లక్ష్యం వహిస్తే ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తి కావన్నారు. భూసేకరణ, ఆర్అండ్ఆర్, అటవీ అనుమతులకు సంబంధించి నిధులను వెంటనే మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీతక్క, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, రామచంద్ర నాయక్, బీర్ల ఐలయ్య, వేముల వీరేశం పాల్గొన్నారు. ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి, కడియం కావ్య, రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య హాజరయ్యారు.

ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, వీర్లపల్లి శంకర్, ప్రేమ్ సాగర్ రావు, నవీన్ యాదవ్, మట్టా రాగమాయి, మందుల సామేల్, వెడ్మ బొజ్జ, కోరం కనకయ్య , లక్ష్మీకాంతరావు, రాందాస్ నాయక్, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్, బత్తుల లక్ష్మారెడ్డి, మనోహర్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి , మురళి నాయక్, యశస్విని రెడ్డి పాల్గొన్నారు.

#Cm Revanth Reddy#Telangana Assembly Sessions#Projects#Land Acquisition#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి