సినిమా

Balakrishna: NBK111 టైటిల్స్ పరిశీలనలో దాదా..గాడ్!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Balakrishna: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సినిమా అంటే అందరూ ముందు ఆలోచించేది ఎలాంటి పవర్ ఫుల్ టైటిల్‌ని పెట్టబోతున్నారు అని. 'సమరసింహారెడ్డి' సినిమా నుంచి నందమూరి అభిమానుల్లో, సినీ లవర్స్‌లో, ప్రేక్షకుల్లో ఈ ఆతృత మొదలైంది. అప్పటి నుంచే బాలయ్య సినిమా కథ, బ్యాక్ డ్రాప్, గెటప్, టైటిల్ గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది. ఇప్పుడు బాలయ్య రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య తన 111వ సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. కాకినాడలో జరిగిన గాయం కారణంగా లాంగ్ బ్రేక్ తీసుకుంటాడని అందరూ అనుకున్నారు. కానీ, బాలయ్యకి ఉన్న కమిట్‌మెంట్ వల్ల వీలైనంత త్వరగానే సెట్స్‌లోకి జాయిన్ కాబోతున్నాడు. అంతేకాదు, డిసెంబర్ 24 న భారీ స్థాయిలో రిలీజ్ కూడా ప్లాన్ చేస్తున్నారు.

పరిశీలనలో రెండు పవర్‌ఫుల్ టైటిల్స్:

గోపీచంద్ మలినేని-బాలకృష్ణ కలయికలో ఇంతకముందు వీర సింహారెడ్డి అనే సినిమా వచ్చింది. ఈ టైటిల్, బాలయ్య మేకోవర్ బాగా కుదిరాయి. దాంతో, ఇప్పుడు తెరకెక్కుతున్న సినిమా లుక్ అండ్ టైటిల్ గురించి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల టీజర్ ను వదిలారు. అందులో బాలయ్య లుక్ అదిరిపోయింది. యాక్షన్ సీన్స్ కూడా ఊహించినదానికంటే ఎక్కువగానే ఉంటాయని హింట్ ఇచ్చాడు గోపీచంద్ మలినేని.

ఇక, ఈ సినిమా కోసం రెండు టైటిల్స్ ని రిజిస్టర్ చేయించారట. వాటిలో ఒకటి 'దాదా' కాగా, మరో టైటిల్ 'గాడ్'. కథకి ఈ రెండు టైటిల్స్ బాగా యాప్ట్ అవుతాయని మేకర్స్ భావిస్తున్నారట. ఆల్రెడీ బాలయ్యకి నట సింహం కాకుండా గాడ్ ఆఫ్ మాసెస్ అనే బ్రాండ్ నేమ్ ని ఇచ్చారు అభిమానులు. కాబట్టి, 'గాడ్' అనే టైటిల్ పర్‌ఫెక్ట్ అని చూస్తున్నారట. మరి, ఏ టైటిల్ ని ఫైనల్ చేస్తారో చూడాలి. ఇక, ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార నటిస్తోంది. మ్యూజిక్ సెన్షేషన్ ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నాడు.

#balakrishna#nbk#nbk111#gopichandmalineni#ss.thaman
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి