సినిమా

Raviteja-Shiva Nirvana: ఇరుముడి సంబరాల్లో మునిగితేలుతున్న చిత్రబృందం

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Raviteja-Shiva Nirvana: ఇరుముడి సంబరాల్లో మునిగితేలుతున్న చిత్రబృందం. అవును..ఈ ఆగస్టు 21న భారీ స్థాయిలో రిలీజైంది ఈ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఇరుముడి చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. ఒకే ఒక్కరోజులో పబ్లిక్ టాక్ దెబ్బకి బ్లాక్ బస్టర్ అని సెలబ్రేషన్స్ జరిపారు. ఒకటిన్నర రోజులోనే లాభాల్లోకి వచ్చింది ఈ చిత్రం. తాజాగా, ఈ సినిమా భారీ హిట్ అయిన నేపథ్యంలో భారీ కేక్ కట్ చేసి దర్శకుడు శివ నిర్వాణ హీరో రవితేజ డాన్సులతో ఎంజాయ్ చేశారు.

ధమాకా తర్వాత మళ్ళీ రవితేజకి ఇప్పటి వరకూ హిట్ దక్కలేదు. దర్శకుడు శివ నిర్వాణకి అంతే. నిన్నుకోరి, మజిలీ చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. కానీ, ఆ తర్వాత చేసిన టక్ జగదీష్, ఖుషి ఫ్లాపయ్యాయి. దీంతో, గట్టి హిట్ కోసం ఇరుముడి కథతో వచ్చాడు. ఈ సినిమాతో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఇంకా, చెప్పాలంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్‌సింగ్, మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాల రేంజ్ ని మించి వసూళ్ళు వస్తున్నాయి.

మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి హిట్ పడి చాలా ఏళ్ళవుతోంది. ఇది, రవితేజకి..మిగతావాళ్ళకి మైల్ స్టోన్ మూవీ. హీరోయిన్‌గా ప్రియ భవానీ శంకర్ కూడా లైఫ్ లో మొదటిసారి సాలీడ్ హిట్ అందుకుంది. మైత్రీ వారికీ ఈ సినిమా ఊహించని లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమాకి వచ్చిన లాభాలతో మరో నాలుగు సినిమాలను నిర్మించేంత బడ్జెట్ వచ్చింది. అందుకే, తాజాగా ఈ సినిమా గ్రాండ్ సెలబ్రేషన్స్ ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవితేజ-శివ నిర్వాణ మల్లెపూల పల్లకి పాటకి స్టెప్పులేసి ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం, దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియా మొత్తం చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది.

ఈ మధ్యకాలంలో మిగతా జానర్ సినిమాల కంటే ఫ్యామిలీ కథాంశాలే బాగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ జోరును చూపిస్తున్నాయి. ఈ ఏడాది వచ్చిన మన శంకరవరప్రసాద్‌గారు బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఆ తర్వాత సమంత నటించిన మా ఇంటి బంగారం..ఇప్పుడు, వాటికి మించిన ఊహించని విజయం ఇరుముడి సినిమాతో ఇండస్ట్రీకి దక్కింది. ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడే ఇండస్ట్రీలో ఇంకా గొప్ప దర్శకులున్నారని నిరూపితం అవుతోంది. కంటెంట్ ఉంటే ఏ హీరో సినిమా అయినా ఇండస్ట్రీ గొప్పతనాన్ని చూపిస్తుంది అని.

#irumudi#shiva nirvana#raviteja#priya bhavani shankar
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి