సినిమా

God Of War: ఎన్టీఆర్ లుక్ కోసం త్రివిక్రమ్ చేస్తున్నదేంటీ?

రచన: Anshu••4 నిమిషాల పఠనం

God Of War: ప్రతీ సినిమాకి మన దర్శకులు హీరో మేకోవర్ గురించి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుంటారు. కథకి తగ్గట్టుగా హీరో పాత్రను డిజైన్ చేస్తుంటారు. దీని కోసం ఫిజికల్‌గానూ, కాస్ట్యూంస్ పరంగానూ, హేయిర్ స్టైల్ పరంగానూ ఎన్నో మార్పులు చేస్తారు. ఇక, యాక్షన్ సినిమా అయితే ప్రాంతానికి తగ్గ మేకోవర్, హిస్టారికల్ మూవీ దానికి తగ్గ మేకోవర్, పౌరాణిక చిత్రం అయితే దానికి తగ్గ మేకోవర్‌తో తయారవుతుంటారు.

అయితే, ఒక సినిమా కోసం కేవలం ఫైనల్ లుక్ టెస్ట్ కోసం చాలా ట్రయల్స్ వేస్తుంటారు. మహర్షి సినిమాలో మహేష్ గెటప్ ఫైనల్ చేయడానికే చాలా రోజులు ప్రయత్నించారు. అంతగా, హీరో లుక్ మీద కసరత్తులు చేస్తుంటారు. ఇప్పుడు, గురూజీ కూడా ఎన్టీఆర్ లుక్ కోసం ఇలాంటి ప్రయత్నాలే చేస్తున్నాడట. ఆల్రెడీ, ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా కోసం చాలా లుక్స్ ట్రై చేసి ఫైనల్ గా ఇప్పుడున్న లుక్‌లోకి తీసుకొచ్చాడు.

వాస్తవానికి, డ్రాగన్ మూవీలోని తారక్ లుక్ అంతగా ఎవరికీ నచ్చలేదన్నారు. కానీ, ప్రశాంత్ నీల్ ఈ విషయంలో అసలు కాంప్రమైజ్ కాలేదు. ఆయనకున్న విజన్ ప్రకారం అదే లుక్‌ని ఫైనల్ చేశాడు. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక ఎన్టీఆర్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇది, ఓ మైథలాజికల్ సబ్జెక్ట్. అంతేకాదు, ఈ సినిమా త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా.

అందుకే, ఈ సినిమా కోసం త్రివిక్రమ్..చాలా రీసెర్చ్ చేశాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ని దేవుడిగా చూపించబోతున్నాడు. అంతేకాదు, ‘శివుడి కుమారుడు, పార్వతి గర్వకారకుడు అయిన సుబ్రహ్మణ్య స్వామి.. పాత్రలో తారక్ అలరించబోతున్నాడు. అందుకే, ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ విషయంలో త్రివిక్రమ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు. ఈ నేపథ్యంలోనే, ప్రస్తుతం ఎన్టీఆర్ లుక్ కి సంబందించిన వర్క్ గురించే విఎఫ్ఎక్స్ టీమ్ తో త్రివిక్రమ్ చర్చలు జరుపుతున్నాడు. మరి, ఆ లుక్ ఎలా ఉంటుందో చూడాలి.

#trivikram#ntr#god of war#dragon#prashanth neel
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి