Arvind Dharmapuri: తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. నాయకులు ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారు. ఒకరిపై మరొకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగంపై సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి ఆదేశాలతో ఒక ఏసీపీ స్థాయి అధికారి తన కదలికలపై నిఘా పెట్టారని అర్వింద్ ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ దికగా తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను ఉద్దేశించి ఆయన ఒక పోస్ట్ పెట్టారు.
"డీజీపీ సీవీ ఆనంద్ గారూ, మీరు నాకు దశాబ్దాలుగా తెలుసు. మిమ్మల్ని ఎప్పుడూ ఒక సమర్థవంతమైన అధికారిగానే పరిగణించాను. అయితే, ముఖ్యమంత్రి సోదరుడి ఆదేశాల మేరకు ఒక ఏసీపీ స్థాయి అధికారికి నా కదలికలను పర్యవేక్షించే బాధ్యతను అప్పగించినట్లు నా దృష్టికి వచ్చింది" అని అర్వింద్ తన పోస్టులో పేర్కొన్నారు.
''దశాబ్దాలుగా నాకు మీతో పరిచయం ఉంది. మిమ్మల్ని ఎప్పుడూ సమర్థులైన అధికారిగానే భావిస్తుంటాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడి ఆదేశాలతో తెలంగాణ పోలీసు విభాగంలోని ఒక ACP స్థాయి అధికారి నన్ను, నా కదలికలను పర్యవేక్షించే పనిలో ఉన్నారని నాకు ఇటీవల తెలిసింది. ఇది ఒక తీవ్రమైన, ప్రాథమిక ప్రశ్నను లేవనెత్తుతోంది'' అని తన పోస్టులో పేర్కొన్నారు అర్వింద్.
పోలీసు యంత్రాంగం పనితీరుపైనా ఆయన విమర్శలు గుప్పించారు. ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. ''తెలంగాణ పోలీసులు రాజ్యాంగం, చట్టబద్ధమైన అధికారిక వ్యవస్థ ప్రకారం పని చేస్తున్నారా? లేక ముఖ్యమంత్రి కుటుంబసభ్యుల ఆదేశాల మేరకు పని చేస్తున్నారా? నాకు తెలిసినంత వరకు పోలీసులు చట్టానికి మాత్రమే జవాబుదారీగా ఉండాలి, ఏ రాజకీయ కుటుంబానికీ కాదు'' అని తన పోస్టులో తేల్చి చెప్పారు ఎంపీ అర్వింద్.


