వైరల్ న్యూస్

Pratibha Thakkadpally: క్యూట్ గున్నావు.. మీటవుతావా? అని అడిగాడు.. మాజీ క్రీడా శాఖ మంత్రిపై అథ్లెట్ సంచలన ఆరోపణలు

రచన: NK•••4 నిమిషాల పఠనం

Pratibha Thakkadpally: అంతర్జాతీయ అథ్లెట్, తెలంగాణ క్రీడాకారిణి తక్కడపల్లి ప్రతిభ ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో, రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని క్రీడా శాఖ మంత్రిపై ఆమె చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇంటర్వ్యూలో పలు అంశాలపై ప్రతిభ మాట్లాడారు. అదే సమయంలో తన జీవితంలో, క్రీడా రంగంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆమె వాపోయారు.

Pratibha Thakkadpally: అంతర్జాతీయ అథ్లెట్, తెలంగాణ క్రీడాకారిణి తక్కడపల్లి ప్రతిభ ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో, రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని క్రీడా శాఖ మంత్రిపై ఆమె చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇంటర్వ్యూలో పలు అంశాలపై ప్రతిభ మాట్లాడారు. అదే సమయంలో తన జీవితంలో, క్రీడా రంగంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆమె వాపోయారు. ఇక, పొలిటికల్ గా గత ప్రభుత్వంలో ఉన్న క్రీడా శాఖ మంత్రికి గట్టిగా వార్నింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని ఆ ఇంటర్వ్యూలో ప్రతిభ చెప్పారు. ఆ సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె వివరించారు.

తానొక ఇంటర్నేషనల్ అథ్లెట్ నని, తనకు అంతర్జాతీయ స్థాయిలో మెడల్ వస్తే ప్రశంసించాల్సింది పోయి క్యూట్ గున్నావు, మీటవుతావా? అని అడగడంతో తాను అప్పటి క్రీడా మంత్రికి గట్టిగా వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చిందని ప్రతిభ తన ఇంటర్వ్యూలో చెప్పడం ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. ఏమని వార్నింగ్ ఇచ్చావు? అని యాంకర్ అడగ్గా.. “2 నిమిషాల్లో నీ బాడీలో ఏ పార్ట్ పని చేయకుండా చేస్తా” అని తాను అప్పటి క్రీడా మంత్రికి వార్నింగ్ ఇచ్చానని ప్రతిభ చెప్పారు.

గత ప్రభుత్వంలోని క్రీడాశాఖ మంత్రిపై ప్రతిభ చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయవర్గాల్లో కలకలం రేపుతున్నాయి. దీని ఆధారంగా ప్రత్యర్థి పార్టీలు బీఆర్ఎస్ ను టార్గెట్ చేశాయి. బీఆర్ఎస్ హయాంలో మహిళా క్రీడాకారులను ఏ విధంగా వేధింపులకు గురి చేశారో చెప్పేందుకు ఇదే నిదర్శనం అంటూ ప్రతిభ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ప్రత్యర్థి పార్టీల నేతలు. ఇప్పుడీ వీడియో పొలిటికల్ గానూ ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై గత ప్రభుత్వంలో క్రీడాశాఖ మంత్రిగా పని చేసిన వ్యక్తితో పాటు బీఆర్ఎస్ నేతల రియాక్షన్ ఏ విధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి
YouTubeలో చూడండి ↗

తర్వాత చదవండి