తెలంగాణ

తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. ప్రాజెక్టులకు జలకళ!

రచన: Mamatha puppala••3 నిమిషాల పఠనం

అల్పపీడన ప్రభావం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా, రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎండిపోతున్న పంటలకు ఈ వర్షాలు ఎంతో మేలు చేయడంతో రైతన్నల మొఖాల్లో ఆనందం వెల్లువిరుస్తోంది.

అల్పపీడన ప్రభావం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా, రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎండిపోతున్న పంటలకు ఈ వర్షాలు ఎంతో మేలు చేయడంతో రైతన్నల మొఖాల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. అయితే, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు ఇబ్బందులను కూడా సృష్టిస్తున్నాయి.

గడిచిన ఇరవ, నాల్గు గంటల్లో మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీనితో పాటు సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ వర్షాల ప్రభావంతో గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులు క్రమంగా నిండుతున్నాయి.

నిజాంసాగర్ నీటిమట్టం పూర్తిస్థాయికి చేరువవుతుండగా, శ్రీరామ్ సాగర్ జలాశయంలో నీటి నిల్వ 44 టీఎంసీలు దాటింది. కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరగడంతో 17 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్‌కు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో 85 గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు.

భారీ వర్షాల కారణంగా సాధారణ జనజీవనంతో పాటు పారిశ్రామిక రంగానికి కూడా కొంత అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఇల్లందు, మణుగూరు ప్రాంతాల్లోని సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలిగింది. అధికారులు సహాయక చర్యలు చేపట్టి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

#Telangana Rains#Weather Update#Singareni Coal Mines#Kaleshwaram Project#Sriramsagar Dam#Nizamabad News#Medak Rains#Hyderabad Meteorological Department
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి