National

Rains : జలదిగ్భంధంలో ఢిల్లీ ప్రధాన రహదారులు

రచన: Kumar••4 నిమిషాల పఠనం

దేశరాజధాని ఢిల్లీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.దీంతో రాజధానిలోని ప్రధాన రహదారులు వరద నీటిలో చిక్కుకున్నాయి. గత రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మెయిర్ రోడ్డులు చెరువులను తలపిస్తున్నాయి.

దేశరాజధాని ఢిల్లీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.దీంతో రాజధానిలోని ప్రధాన రహదారులు వరద నీటిలో చిక్కుకున్నాయి. గత రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మెయిర్ రోడ్డులు చెరువులను తలపిస్తున్నాయి. ఫలితంగా కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్టు సమాచారం. వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఉదయం పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్‌లో వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

తమ గమ్యస్థానాలకు చేరుకోలేక సామాన్యలు, విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు. రహదారులపై రాకపోకలు నిలిచిపోవడంతో వాహనదారులు ప్రజా రవాణా వైపు మళ్లినట్టు సమాచారం.దీంతో ఢిల్లీ మెట్రో స్టేషన్లు, బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. మరో 24 గంటల పాటు ఢిల్లీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది.

దీంతో దేశ రాజధానిలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఫుల్ ట్రాఫిక్, వర్షాల నేపథ్యంలో ప్రజలు, వీధివ్యాపారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేవారు సైతం నరకం చూస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న గురుగ్రామ్‌లో పాఠశాలలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు. ఇక ఐటీ ఉద్యోగులకు వెంటనే 'వర్క్ ఫ్రమ్ హోమ్' సౌకర్యం కల్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరోవైపు నగర పాలక సంస్థలు, విపత్తు నిర్వహణ అధికారులు రంగంలోకి దిగి ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో భారీగా నిలిచిన నీటిని మోటార్ల ద్వారా తొలగిస్తున్నారు.తిరిగి ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు చర్యలు ముమ్మరం చేశారు.

ఇదిలాఉండగా, ఎల్‌నినో ప్రభావంతో మొన్నటివరకు దేశవ్యాప్తంగా వర్షాలు కురవలేదు. తాజాగా అల్పపీడన ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే, రైతులకు ఉపయోగపడేలా జిల్లాల్లో కురవకుండా రద్దీగా ఉండే కాంక్రీట్ ఏరియాల్లో వర్షాలు కురవడం వల్ల ఏంఉపయోగం అని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

#heavy rains#delhi#main roads#filled water
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి